- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోషల్ మీడియానే ఎక్కువ నమ్ముతున్న యూత్.. ఆ విషయంలో 54% మంది ఆసక్తి ఇదే..!
సోషల్ మీడియానే ఎక్కువ నమ్ముతున్న యూత్.. ఆ విషయంలో 54% మంది ఆసక్తి ఇదే..!

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా ఇప్పుడు ప్రపంచాన్నే మార్చేసింది. ఏదైనా ఒక సమచారం కోసం మరుసటి రోజు వరకు ఎదురు చూసే రోజులకు చెక్ పెట్టింది. సమాచార రంగంలో ట్రెడీషనల్, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు వందరెట్లు అధికంగా ప్రత్యామ్నాయంగా మారింది. ఎప్పటి సమచారం అప్పుడు క్షణాల్లో కళ్లముందు ఉంచుతోంది. దీంతో రోజు రోజుకూ సోషల్ మీడియాకు ఆదరణ పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఒక తాజా సర్వే ప్రకారం అమెరికన్లు, ముఖ్యంగా యువత వార్తలకోసం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపైనే అధికంగా ఆధారపడుతున్నారు.
ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ప్యూ రీసెర్చ్ సెంటర్( Pew Research Center) సర్వే ప్రకారం.. ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, టిక్‌టాక్ వంటి ప్లాట్‌ఫామ్‌లు రోజువారీ వార్తల వినియోగంలో సాంప్రదాయ మీడియా మాధ్యమాలను అధిగమించాయి. ప్రాథమిక సమాచారంతోపాటు చాలా వరకు వార్తలకోసం, అప్‌డేట్స్ కోసం అమెరికన్లు, అందులోనూ ఇక్కడి యువత సోషల్ మీడియానే ఎంచుకుంటోంది. రాయిటర్స్ ఇన్‌స్టిట్యూట్ డిజిటల్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం కూడా ఈ సంవత్సరం(2025, జూన్)లో 54% అమెరికన్లు సోషల్ మీడియా ద్వారానే వార్తలు పొందుతున్నారు. ఇది టెలివిజన్ (50%), వెబ్‌సైట్లు/యాప్‌ల (48%) వార్తల శాతం కంటే కూడా ఎక్కువని సర్వేలు పేర్కొన్నాయి.
ఇక సోషల్ మీడియాలోనే వార్తకోసం చూస్తున్న వారు18 నుంచి 24 ఏండ్ల గలవారిలో 54%, 25 నుంచి 34 ఏండ్ల వయసు గల వారిలో 50% మంది ఉన్నారు. వీరంతా సోషల్ మీడియానే ప్రధాన వార్తా వనరులుగా నమ్ముతున్నారు. ఈ విధమైన మార్పు సమాచార కచ్చితత్వం(Information accuracy), అల్గారిథమ్‌ల ద్వారా నడిచే కంటెంట్, డిజిటల్ యుగంలో న్యూస్ లిటరసీ (On news literacy)పై పలు సందేహాలను కూడా లేవనెత్తుతోంది. సోషల్ మీడియాలో వార్తలు తరచుగా ‘న్యూస్ ఇన్‌ఫ్లుయెన్సర్ల’ ద్వారా వ్యాప్తి చెందుతాయి. అయినప్పటికీ 21% అమెరికన్లు దానినే నమ్ముతున్నారని ప్యూ రీసెర్చ్ సర్వే తెలిపింది. అదే సందర్భంలో 51% అమెరికన్లు తప్పుడు సమాచారాన్ని పెద్ద సమస్యగా భావిస్తుండగా, 36% మంది అదొక సాధారణ సమస్యగా చూస్తున్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాపైనే మొగ్గు చూపుతున్నారు.






