మామిడిపండ్ల‌లోనే మహారాజు మియాజాకి.. వీటిని తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే

by Ajay Maddhiboyina |

ప్ర‌పంచంలో దొరికే పండ్లు అన్నింటిలో మామిడి పండును పండ్ల రాజు అని పిలుస్తుంటారు. అంతే ఆ పండు రేంజ్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. కేవ‌లం సీజ‌న్ లోనే దొరికే ఈ పండు అంటే న‌చ్చ‌నివాళ్లు ఉండ‌రు.

మామిడిపండ్ల‌లోనే మహారాజు మియాజాకి.. వీటిని తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్ర‌పంచంలో దొరికే పండ్లు అన్నింటిలో మామిడి పండును పండ్ల రాజు అని పిలుస్తుంటారు. అంతే ఆ పండు రేంజ్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. కేవ‌లం సీజ‌న్ లోనే దొరికే ఈ పండు అంటే న‌చ్చ‌నివాళ్లు ఉండ‌రు. సీజ‌న్ వ‌చ్చిందంటే చాలు కేజీలు కేజీలు లాగించేస్తుంటారు. జ్యూస్ లు, జామ్ లు, ఊర‌గాయ అంటూ ర‌క‌ర‌కాలుగా మామిడిపండును ఎంతో ఇష్టంగా తింటారు. మామిడిపండ్ల‌లోనూ అనేక ర‌కాలు ఉన్నాయి. మామిడిపండ్ల‌లోనూ ఓ ర‌కం పండ్ల‌ను అవే కింగ్ అని చెప్పుకుంటారు. అవే మియాజాకి మామిడి పండ్లు. వీటి ధ‌ర కేజీ రూ.2.50 వేల నుండి రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంది. ప్ర‌పంచంలోనే ఇవే అత్యంత ఖరీదైన మామిడిపండ్లు. వీటిని జ‌పాన్ లో ప్రిఫెక్ట‌ర్ లో అత్యంత క‌ట్టుదిట్ట‌మైన నియంత్రిత ప‌రిస్థితుల్లో పండిస్తుంటారు.

చూడ్డానికి ముదురు ఎరుపు రంగుగా ఉండే ఈ పండ్లు ర‌స‌వంతంగా, చాలా తీపిగా ఉంటాయి. ఈ మామిడిపండ్లు చాలా ప్ర‌కాశవంతంగా ఎర్ర‌గా ఉండ‌టం వ‌ల్ల వీటిని సూర్యుడి గుడ్డు అని కూడా పిలుస్తుంటారు. వీటికి ఆ రేంజ్ ధ‌ర ప‌ల‌క‌డానికి కూడా కొన్ని కార‌ణాలు ఉన్నాయి. ఈ పండ్ల అమ్మకానికి ముందు క‌ఠిన‌మైన నాణ్య‌త త‌నిఖీలు నిర్వ‌హిస్తుంటారు. ప్ర‌తి సీజ‌న్ లోనూ వీటిని ప‌రిమితంగా పండించ‌డ‌మే కాకుండా ప్ర‌త్యేక‌మైన సాగు ప‌ద్ద‌తుల్లో పండిస్తారు. అదేవిధంగా ఇవి పండాలంటే నియంత్రిత సూర్య‌ర‌శ్మి, ఉష్ణోగ్ర‌త కూడా అవ‌స‌ర‌మే. వీటిని పండించేట‌ప్పుడు చెట్టుకు ఉన్న ప్ర‌తిపండును ప‌ర్య‌వేక్షిస్తుంటారు. అందువ‌ల్లే జ‌పాన్ లో పండే ఈ పండ్లు తినాలి అంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.

Next Story