ఇదేం అద్భుతం.. ఐదు రకాల రంగులతో ప్రవహిస్తున్న నది..

by Sujitha Rachapalli |

* వర్షాకాలం ఎఫెక్ట్ అనుకుంటా * ఐదు రకాల రంగుల మిశ్రమంగా ప్రవహిస్తున్న నది * ఇదేం అద్భుతమంటూ ఆశ్చర్యపోతున్న జనాలు * ఈ నది వెనుకున్న అసలు కథేంటి?

ఇదేం అద్భుతం.. ఐదు రకాల రంగులతో ప్రవహిస్తున్న నది..
X

దిశ, వెబ్‌డెస్క్ : సాధారణంగా నదులు స్వచ్ఛమైన నీటితో గలగల పారుతుంటాయి. పవిత్రతకు మారు పేరుగా నిలుస్తాయి. వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఎరుపు రంగులో ప్రవహించే నదులను చూశాం. కానీ ఈ నది మాత్రం ఏకంగా ఐదు రకాల రంగులతో ప్రవహిస్తుంది. కొలంబియాలోని కానో క్రిస్టల్స్‌.. అద్భుతమైన రంగులకు ప్రసిద్ధి చెందగా.. దీన్ని లిక్విడ్ రెయిన్బో అని కూడా పిలుస్తారు. వానా కాలంలో నదీ తీరంలోని మొక్కలు.. ఎరుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు, పసుపు రంగుల మిశ్రమాన్ని సృష్టిస్తుండగా.. ప్రపంచంలోనే అత్యంత అందమైన నదుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. దీని కారణంగా కానో క్రిస్టల్స్‌కు పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.

Next Story