పారాసైలింగ్‌ సరదా.. గాల్లోకి ఎగరగానే సేఫ్టీ బెల్ట్ తీసేసిన యువతి.. చివరికి!?(వీడియో)

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-03 15:01:59  IST  )

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది.

పారాసైలింగ్‌ సరదా.. గాల్లోకి ఎగరగానే సేఫ్టీ బెల్ట్ తీసేసిన యువతి.. చివరికి!?(వీడియో)
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చిత్రవిచిత్ర ఘటనలతో పాటు షాకింగ్ ఘటనలు కూడా వెలుగు చూస్తుండడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సామాజిక మాధ్యమాల్లో ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పారాసైలింగ్ అంటే చాలా మందికి ఎంతో సరదాగా అనిపిస్తుంటుంది. పారాసైలింగ్ చేస్తున్నప్పుడు సేఫ్టీ బెల్ట్, సేఫ్టీ హార్నెస్‌ను ధరిస్తారు. అనంతరం గాల్లో విహరిస్తూ సంతోషంగా ఫీల్ అవుతుంటారు.

తాజాగా ఓ యువతి మాంటెనెగ్రోలో పారాసైలింగ్‌‌కు(parasailing) వెళ్లింది. ఈ క్రమంలో పారాసైలింగ్ సరదా ఆమె పాలిట శాపంగా మారింది. గాల్లో విహరిస్తుండగా ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైంది. ఆ తర్వాత ఏమైందంటే.. సెర్బియాకు చెందిన టియానా(19) అనే యువతి తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు బుడువాకు వెళ్లింది. అక్కడే బీచ్‌లో ఓ వ్యక్తి ఉచిత పారాసైలింగ్ రైడ్ ఆఫర్ చేయడంతో ఆ యువతి అంగీకరించినట్లు సమాచారం. పారాసైలింగ్ చేస్తుండగా ఆమె ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైంది.

భయంతో ఆమెకు చేయాలో అర్థం కాకపోవడంతో.. తన లైఫ్ జాకెట్, సేఫ్టీ బెల్ట్ విప్పేసింది. దీంతో సుమారు 160 అడుగుల ఎత్తు నుంచి సముద్రంలో పడిపోయింది. ఈ క్రమంలో ఆమె రాడోన్‌జిక్ సముద్రంలో పడిపోయినట్లు సమాచరం. అనంతరం సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవల సిబ్బంది రంగంలోకి దిగి గాలించినప్పటికీ, అప్పటికే యువతి మృతి చెందినట్లు గుర్తించారు. దీంతో కుటుంబంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. ఈ విషాద ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Next Story