Video:ఫుల్లుగా తాగి రాపిడో ఎక్కిన యువతి.. మత్తులో ఏం చేసిందో తెలిస్తే షాక్.. నెటిజన్లు ఫైర్!?

by Jakkula.Mamatha |

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Video:ఫుల్లుగా తాగి రాపిడో ఎక్కిన యువతి.. మత్తులో ఏం చేసిందో తెలిస్తే షాక్.. నెటిజన్లు ఫైర్!?
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో పై నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. అసలు విషయమేంటంటే.. కల్చర్ పేరుతో లిక్కర్ డ్రింకింగ్ మహిళల్లోనూ పెరుగుతోంది. క్రమక్రమంగా అది హద్దులు దాటుతుందనడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే.. తాజాగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియోనే నిదర్శనం.

ఆ వీడియో ప్రకారం.. ఢిల్లీ నైట్ క్లబ్‌లో ఫుల్లుగా మద్యం తాగిన ఓ యువతి రాపిడో బైక్ బుక్ చేసుకుంది. ఈ తరుణంలో ఆ యువతి మత్తు ఎక్కువై సరిగ్గా కూర్చోలేకపోయింది. బైక్ పై కూర్చోగానే ఒక్కసారిగా కిందకు జారిపోయింది. దీంతో రాపిడో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఈ వీడియో వైరలవుతుండగా ఆ యువతి పై నెటిజన్లు మండిపడుతున్నారు. స్పృహ లేని పరిస్థితుల్లో అవాంఛనీయ ఘటనలు జరిగితే బాధ్యత ఎవరిదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.వీడియో ఇదే..

Next Story