‘ఆటోలో అమ్మాయి’ కేవలం 2 సెకన్ల వీడియోతో ఎక్స్‌ని కుదిపేసింది.. వైరల్ క్లిప్‌లో ఏముంది..?

by Ramesh Naini |   (  Updated:2025-11-22 17:29:15  IST  )

సోషల్ మీడియా మాయ అని ఇంకోసారి నిరూపితమైంది. వైరల్ అవ్వడానికి పెద్ద సెటప్ అవసరం లేదు.. కేవలం 2 సెకన్ల వీడియో మాత్రమే చాలు.

‘ఆటోలో అమ్మాయి’ కేవలం 2 సెకన్ల వీడియోతో ఎక్స్‌ని కుదిపేసింది.. వైరల్ క్లిప్‌లో ఏముంది..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా మాయ అని ఇంకోసారి నిరూపితమైంది. వైరల్ అవ్వడానికి పెద్ద సెటప్ అవసరం లేదు.. కేవలం 2 సెకన్ల వీడియో మాత్రమే చాలు. సమాజిక మాధ్యమాల్లో ఏ వీడియో ఎప్పుడు, ఎలా, ఎందుకు వైరల్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు అదే మరోసారి రుజువైంది. ఒక యువతి ఆటోలో కూర్చొని తీసిన రెండు సెకన్ల వీడియో ప్రస్తుతం ఎక్స్‌ (ట్విట్టర్) ప్లాట్‌ఫారమ్‌ను షేక్ చేస్తోంది. దేశవ్యాప్తంగా కోట్లు దాటిన వ్యూస్‌తో ఈ క్లిప్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నవంబర్ 2 వ తేదీన ‘Bud Wiser (@w0rdgenerator)’ అనే యూజర్ ఈ చిన్న వీడియోను ‘Makeup ate today’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది.

వీడియోలో అమ్మాయి వైట్ టాప్, వెండి చెవిపోగులు ధరించి, సింపుల్ లుక్‌లో ఆటోలో కూర్చున్నట్లు కనిపిస్తుంది. సరదాగా పోస్ట్ చేసిన ఈ ట్వీట్.. ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతూ ప్రస్తుతం 102 మిలియన్ వ్యూస్‌కు పైగా దూసుకెళ్లింది. ఈ ఒక్క క్లిప్‌తో ఆ యువతి లక్షల్లో సంపాదించినట్లు అంచనాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది సోషల్ మీడియా నిపుణుల ప్రకారం, ఈ వైరల్ ట్వీట్ ద్వారా ఆమె రూ. 5 లక్షల వరకు సంపాదించి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఓవర్‌నైట్ ఇంటర్నెట్ సెన్సేషన్

సాధారణంగా కంటెంట్ క్రియేటర్లకు వైరల్ కావడం అంటే నెలలు, సంవత్సరాల కష్టమే. కానీ ఈ యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో బండానా గర్ల్‌గా ప్రసిద్ధి పొందిన ప్రియంగా కేవలం రెండు సెకన్ల వీడియోతో ఇంటర్నెట్‌ను ఊపేసింది. ఏమి చేయకుండానే ఒక్క క్లిప్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన ఈ యువతిపై నెటిజన్లు ఇంకా ఆశ్చర్యపోతున్నారు. ‘ఈ పోస్ట్‌లో అంత ప్రత్యేకత ఏముంది?’ అని చాలా మంది నెటిజన్లు కామెంట్‌ చేశారు.

ఎందుకింత వైరల్? ఎవరికీ తెలియదు!

వీడియోలో ప్రత్యేకంగా ఏమీ లేకపోయినా.. ఏదో కారణం చేత ఈ క్లిప్ ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ అయింది. ఆల్గోరిథమ్స్ హంగామా, నెటిజన్ల రియాక్షన్స్ నుంచి కొందరు మితిమీరిన మెసేజీల వరకు ఈ క్లిప్ సోషల్ మీడియాలో చిన్న కుదుపు తీసుకుంది. వీడియో వైరల్ ఎలా అయిందో తనకు కూడా తెలియదని ఆ వీడియోలో ఉన్న ప్రియాంగా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కాగా, ఒక చిన్న, సాధారణ @w0rdgenerator అనే ఎక్స్ ఖాతా నుంచి వీడియో వైరల్ కావడంతో ఆమె బ్లూ టిక్ తీసుకుంది. మరోవైపు ఫాలోవర్ల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఆమెకు 20 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. వైరల్ ట్వీట్ ఇదే..

Next Story