- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కట్నం అడిగిన వరుడిని పెళ్లాడనన్న యువతి.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!
by Jakkula.Mamatha |
కట్నం అడిగిన వరుడిని పెళ్లి చేసుకోనని చెప్పడం, లేదా అతన్ని తిరస్కరించడం వంటి సంఘటనలు జరుగుతుండటం గమనిస్తూనే ఉన్నాం.

X
దిశ,వెబ్‌డెస్క్: కట్నం అడిగిన వరుడిని పెళ్లి చేసుకోనని చెప్పడం, లేదా అతన్ని తిరస్కరించడం వంటి సంఘటనలు జరుగుతుండటం గమనిస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువతికి వివాహం నిశ్చయమైంది. వరుడి కుటుంబ సభ్యులు కట్నం అడిగారు. దీంతో ఆ యువతి రూ.20 లక్షల కట్నం, కారు డిమాండ్ చేసిన వరుడిని తాను పెళ్లి చేసుకోనని చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుడు కట్నం అడిగితే ఆమె మొదట ఎందుకు అంగీకరించింది? కట్నం డిమాండ్ చేయని ఒక పేద వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు కదా? అలా కాకుండా ధనవంతుడినే ఎందుకు కోరుకుంది? పెళ్లి వ్యాపారంగా మారింది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ.. నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
Next Story






