- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Reels : రీల్స్ పిచ్చిలో యువతి.. లాగిపెట్టి కొట్టిన వ్యక్తి.!
ఈ మధ్య కాలంలో యువతకి రీల్స్ పిచ్చి బాగా ముదిరింది.

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య కాలంలో యువతకి రీల్స్ పిచ్చి బాగా ముదిరింది. ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో అనే ధ్యాస లేకుండా రీల్స్ చేస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. అయితే ఇలాగే రైల్వే ఫ్లాట్ ఫాంపై ఓ యువతి రీల్స్ చేస్తుండగా.. అక్కడే ఉన్న యువకుడు ఏం చేశాడో తెలిస్తే.. మంచి పని చేశావు భయ్యా అనకుండా ఉండలేరు. రైల్వే స్టేషన్ వద్ద రైలు ఆగి ఆగగానే రైలు దిగిన ఓ యువతి రైల్వే ప్లాట్ ఫారంపై రీల్స్ చేస్తూ హల్ చల్ చేసింది. అదంతా చూస్తున్న అక్కడే ఉన్న ఓ వ్యక్తి వచ్చి "ఇది తమాషా చేయడానికి సరైన స్థలమా?" అంటూ ఆమెను తోసేశాడు. దీనికి యువతి కోపంగా స్పందించగా.. వెంటనే ఆ వ్యక్తి ఆమెను క్షమించమని కోరుతూ, పబ్లిక్‌లో ఇలా చేయకూడదని హితవు పలికాడు. దాంతో వెంటనే ఆ యువతి అక్కడినుంచి కోపంగా వెళ్ళిపోయింది. అయితే ఈ వీడియోపై స్పందించిన నెటిజన్స్.. ఇలా పబ్లిక్ లో న్యూసెన్స్ చేయడం ఎందుకు అని, ఆ రైలు కిందకే తోసేయ్ భయ్యా అని కామెంట్స్ చేస్తున్నారు.






