అమ్మాయి పిలిచిందని సొల్లు కార్చుకుంటూ వెళ్లిన యువకుడు.. రెండు గంటల్లోనే..!

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-11-15 15:46:59  IST  )

సెల్ ఫోన్ వచ్చాక అంతా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతుంది. ఫుడ్, షాపింగ్, ఇంటర్వ్యూలు ఇలా ఏదైనా మొబైల్‌లోనే కానిస్తున్నారు. చివరికి పెళ్లి చూపులు కూడా ఫోన్లలోనే చూసుకుంటున్నారు.

అమ్మాయి పిలిచిందని సొల్లు కార్చుకుంటూ వెళ్లిన యువకుడు.. రెండు గంటల్లోనే..!
X

దిశ, వెబ్‌డెస్క్: సెల్ ఫోన్ వచ్చాక అంతా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతుంది. ఫుడ్, షాపింగ్, ఇంటర్వ్యూలు ఇలా ఏదైనా మొబైల్‌లోనే కానిస్తున్నారు. చివరికి పెళ్లి చూపులు కూడా ఫోన్లలోనే చూసుకుంటున్నారు. ఫోన్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఆత్మీయులు, బంధువులు సైతం నేరుగా కలుసుకునే రోజులు పోయి.. హాయ్.. బాయ్.. అంటూ వీడియో కాల్స్‌తోనే సరిపెట్టుకుంటున్నారు. కొత్త స్నేహితులను, లవర్స్‌నూ ఫోన్లలోనే వెతుక్కుంటున్నారు. తాజాగా ఓ యువకుడు కూడా ఓ డేటింగ్ యాప్‌లో యువతిని పరిచయం చేసుకున్నాడు. ఆమె డేటింగ్‌కు రమ్మన్నదని సొల్లు కార్చుకుంటూ వెళ్లి బొక్కబోర్ల పడ్డాడు. ఆ యువతి చేసిన మోసాన్ని వివరిస్తూ ఆ యువకుడు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

పూణెకు చెందిన యువకుడికి బంబుల్ ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో ఓ యువతి పరిచయం అయింది. కొద్దిరోజుల పరిచయంలోనే ఆమె ఆ యువకుడికి డేటింగ్ ఆఫర్ ఇచ్చింది. ఎగిరిగంతేసిన ఆ యువకుడు.. ఎన్నో ఊహలతో ఆమె చెప్పిన ప్రాంతానికి వెళ్లాడు. ఇద్దరు కలిసి ఓ బార్‌లో కలుసుకున్నారు. యువతి వైన్ బాటిల్ ఆర్డర్ చేయడంతో ఇద్దరు కలిసి దానిని తాగేశారు. ఆ తర్వాత బేరర్ తెచ్చిన బిల్లును చూసిన యువకుడికి కళ్లు బైర్లుకమ్మాయి. వైన్ బాటిల్‌కు రూ.15 వేలు, వైస్ గ్లాస్‌కు రూ.10వేల బిల్లు వేశారు. బేరర్ పొరపాటున బిల్లు తప్పుగా వేశాడేమో అని సదరు యువకుడి అతడిని ప్రశ్నించగా.. కరెక్ట్ బిల్లేనని సమాధానం ఇవ్వడంతో షాక్ అయ్యాడు.

అయితే దీనిపై ప్రశ్నించిన యువకుడితో బార్ సిబ్బంది గొడవకు దిగారు. మరోవైపు డేటింగ్‌కు వచ్చిన యువతి సైతం బార్ సిబ్బందినే సపోర్ట్ చేసింది. ఇక్కడ బిల్లు కట్టకపోతే తమ కార్లను ధ్వంసం చేస్తారని.. వాళ్లు అడిగినంతా బిల్లు చెల్లించాలని ఒత్తిడి తెచ్చింది. గత్యంతరం లేక ఆ యువకుడు రూ.25 వేల బిల్లు కట్టాడు. ఆ లోపే ఆ యువతి అక్కడి నుంచి జారుకుంది. అతడికి హ్యాండిచ్చి వెళ్లిపోయింది. ఆమెతో రెండు గంటలు స్పెండ్ చేసినందుకు రూ.25 వేలు లాస్ అయ్యాయనని యువకుడు వాపోయాడు. అయితే ఆ యువతి కారణంగా తను నష్టపోయిన విధానాన్ని అతడు ట్విట్టర్‌లో షేర్ చేయడంతో నెటిజన్లు రకరకాలు కామెంట్స్ పెడుతున్నారు. ‘ముక్కు, మొఖం తెలియని అమ్మాయి పిలిస్తే వెళ్తావా..’ ‘అమ్మాయి పిలిచిందని సొల్లు కార్చుకుంటూ వెళ్లావా..’ ‘అది కన్నింగ్ లేడీ..’ ‘బార్ సిబ్బందికి అమ్మాయికి లింక్ ఉండి ఉంటుంది..’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Read More..

ఏందయ్యా ఇది ప్రీ వెడ్డింగ్ షూటా..? శవాలు అనుకున్నామే..! (వీడియో)

Next Story