- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏందయ్యా ఇది ప్రీ వెడ్డింగ్ షూటా..? శవాలు అనుకున్నామే..! (వీడియో)
ఈ మధ్య కాలంలో పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్, ఆ తర్వాత పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ కామన్‌గా అయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్, ఆ తర్వాత పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ కామన్‌గా అయ్యాయి. పెళ్లి చేసుకోబోయే జంటలు తమ భాగస్వామితో మధురమైన జ్ఞాపకాలను జీవితాంతం గుర్తుండి పోయేలే ఈ వెడ్డింగ్ షూట్‌లకు ఎక్కువగా ప్లాన్ చేస్తున్నారు. అయితే.. పెళ్లికి అయ్యే ఖర్చుకంటే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్‌లకు అయ్యే ఖర్చే ఎక్కువవుతుందనడంలో ఆశ్చర్యం లేదు. ఇక ఆనందానికో, జ్ఞాపకానికో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటే పర్లేదు కానీ.. కొంతమంది మరి పైత్యానికి పోయి వింత వింత షూట్స్ చేసుకుంటున్నారు.
డ్రైనేజీ గుంతల్లో, శ్మశానంలో, నగ్నంగా ప్రీ వెడ్డింగ్ షూట్‌లు చేసుకుని వార్తల్లో నిలుస్తున్నారు. ఇలాంటి ప్రీ వెడ్డింగ్ ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ కోవకు చెందిన మరో ప్రీ వెడ్డింగ్ షూట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ జంట నది ఒడ్డున ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటున్నారు. నీళ్లలో శవాల్లా పడుకోని స్టిల్స్ ఇచ్చారు. అయితే ఆ పెళ్లి జంటను సడెన్‌గా చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇది ప్రీ వెడ్డింగ్ షూటా.. నది నుంచి కొట్టుకొచ్చిన శవాలు అనుకున్నామే’ అంటూ నెట్టింట నెగిటివ్ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.






