- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Snake bite : బెడ్‌పై నిద్రపోతుండగా యుకుడిపైకి పాకుతూ వచ్చిన నాగుపాము.. అంతలోనే ఏం చేసిందంటే..(Viral video)
Snake bite : బెడ్‌పై నిద్రపోతుండగా యుకుడిపైకి పాకుతూ వచ్చిన నాగుపాము.. అంతలోనే ఏం చేసిందంటే..(Viral video)

దిశ, ఫీచర్స్ : దాదాపు వర్షాకాలం వచ్చినట్లే.. ఇంకొన్ని రోజులైతే నైరుతి రుతుపవనాల ప్రభావం అంతటా విస్తరిస్తుంది. అయితే ఈ సీజన్‌లో గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో కనిపించే మార్పుల్లో మరొకటి ఏంటంటే.. పాము(snake)ల బెడద. ఎందుకంటే ఇవి ‘కోల్డ్-బ్లడెడ్ జీవులు’ కావడంతో చల్లని వాతావరణంలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి వెచ్చని ప్రదేశాలను వెతుకుతుంటాయి. ఈ క్రమంలోనే ఇండ్లల్లోకి ప్రవేశించి గది మూలలు, సోఫాలు, బెడ్‌లు, టాయిలెట్‌లు వంటి ప్రదేశాల్లో తలదాచుకునే ప్రయత్నం చేస్తుంటాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లోని ఓ గ్రామంలో అదే జరిగింది. ఓ యువకుడు బెడ్ మీద పడుకొని ఉండగా, సడెన్‌గా ఓ నాగు పాము అతనిపై నుంచి పాకుతూ వచ్చింది. తర్వాత ఏం జరిగిందంటే..
వైరల్ వీడియో ప్రకారం.. అది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఓ గ్రామం. అక్కడ ఓ ఇంటిలో మంచంపై యువకుడు పడుకొని ఉండగా.. అంతలోనే ఓ తెల్లటి కట్లు(చారలు) కలిగిన నల్లటి నాగుపాము ఇంట్లోకి ప్రవేశించింది. అయితే మంచం పక్కనే మరిన్ని దుస్తులు, దుప్పట్లు, ఫ్యాన్ వంటివి ఉన్నాయి. వాటన్నింటినీ దాటుకొని మెల్లిగా యువకుడు పడుకున్న బెడ్‌పైకి ఎక్కిన నాగుపాము(Cobra), అతను కప్పుకొన్న దుప్పటిపై నుంచి, నడుము భాగంపై నుంచి, కాళ్లపై నుంచి, చేతులపై నుంచి పాకుతూ వెళ్తోంది. అంతలోనే యువకుడికి నిద్ర మెలుకువ వచ్చినట్లుంది కానీ.. అతను ధైర్యవంతుడు. సడెన్‌గా పైకి లేస్తే కాటు వేస్తుందేమో(snake bite)అనుకున్నట్లున్నాడు. కాబట్టి పాము అతనిమీద నుంచి వెళ్లిపోయే వరకు కదలకుండా నక్కి పడుకున్నాడు. పాము అతన్ని దాటిపోయాక లేచి చూశాడు. చూడ్డానికే ఒళ్లుజలదరించేలా ఉన్న ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. అసలే వర్షాకాలం, ఇండ్లల్లోకి పాములు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పలువురు నెటిజన్లు.






