బెట్టింగ్ యాప్స్‌కు యువకుడు బలి.. KA పాల్ సంచలన వీడియో విడుదల

by Kema Shiva Kumar |

తెలుగు రాష్ట్రాలను బెట్టింగ్ యాప్స్ (Betting Apps) భూతం పట్టి పీడిస్తోంది. ఈజీ మనీకి అలవాటు పడి యువత పెడదోవ పడుతోంది.

బెట్టింగ్ యాప్స్‌కు యువకుడు బలి.. KA పాల్ సంచలన వీడియో విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాలను బెట్టింగ్ యాప్స్ (Betting Apps) భూతం పట్టి పీడిస్తోంది. ఈజీ మనీకి అలవాటు పడి యువత పెడదోవ పడుతోంది. కుప్పలు తెప్పలుగా అప్పులు చేసి కష్టం చెప్పుకోకుండా ఆత్యహత్యలకు పాల్పడుతూ.. కన్నోళ్లకు కడుపుకోతను మిగులుస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం ప్రాంతానికి చెందిన నరేశ్ (38) బెట్టింగ్స్ యాప్స్ వల్ల బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలోనే యువత ఆత్మహత్యలు, బెట్టింగ్స్ యాప్స్‌ నిషేధంపై తాజాగా ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ (KA Paul) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ప్రధానికి తన సందేశం చేరేలా ఓ వీడియోను విడుదల చేశారు.

ఆ వీడియోలో కేఏ పాల్ (KA Paul) మాట్లాడుతూ.. ఐదు రోజుల క్రితం సుప్రీం కోర్టులో తాను బెట్టింగ్స్ యాప్స్ నిషేధంపై వాదనలు వినిపించానని పేర్కొన్నారు. తాజాగా, వనస్థలిపురంలో 38 ఏళ్ల నరేష్ అనే యువకుడు బెట్టింగ్ యాప్స్‌ కారణంగా ఆరేళ్ల తన కూతురుతో పాటు భార్యను ఒంటిరిని చేస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. అతడు రూ.15 లక్షల అప్పు చేశానంటూ.. ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi)కి కూడా లేఖ రాశాడని తెలిపారు. ఆరేళ్లుగా అప్పులు తీర్చేందుకు అతడు కష్టాలు పడ్డాడని.. బెట్టింగ్ యాప్స్ మొత్తం దేశంలో బ్యాన్ చేయాలని లేఖలో నరేశ్ ప్రస్తావించాడని తెలిపారు. అదేవిధంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతోన్ని వేళ 776 మంది పార్లమెంట్ సభ్యులు బెట్టింగ్స్‌పై కలిసకట్టుగా పోరాటం చేసి చట్టం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయాలన్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బెటింగ్స్ యాప్స్ గూగుల్ నుంచి రిమూవ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారని.. వెంటనే సదరు సంస్థ వాటిని సైట్ల నుంచి తొలగించాలని కేఏ పాల్ విజ్ఞప్తి చేశారు. ఈ పోరాటంలో నేను ఒంటరిగా పోరాడలేనని లోకసభా పక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా ఈ విషయంపై చొరవ తీసుకోవాలని అన్నారు.

Next Story