- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాగుపాముల సంచితో ఆసుపత్రికి వచ్చిన యువకుడు.. సిబ్బంది పరుగో పరుగు
ఓ వ్యక్తి నాగుపాముల సంచితో ఆసుపత్రికి రావడంతో.. డాక్టర్లు, సిబ్బంది ప్రాణభయంతో పరుగులు పెట్టిన ఘటన బిహార్ లో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఓ వ్యక్తి నాగుపాముల సంచితో ఆసుపత్రికి రావడంతో.. డాక్టర్లు, సిబ్బంది ప్రాణభయంతో పరుగులు పెట్టిన ఘటన బిహార్ లో చోటు చేసుకుంది. బిహార్ రాష్ట్రం రోహ్‌తాస్ జిల్లా రాజ్‌పుర్‌కు చెందిన గౌతమ్‌కుమార్ అనే పాములు పట్టే నిపుణుడు తాను పట్టుకున్న మూడు నాగుపాములను అడవికి తరలిస్తుండగా వాటిలో ఒకటి కరిచింది. ఏ పాము కరిచిందో తెలియక ఆటను ఆ మూడు పాములతోనే నేరుగా సాసారాం జిల్లా ఆసుపత్రికి వచ్చాడు. భారీ పొడవు ఉన్న నాగుపాములను చూసి ఆసుపత్రి సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు.
కాగా విషయం తెలుసుకున్న వైద్యులు అతనికి చికిత్స అందించి, ప్రాణాలు కాపాడారు. అయితే పాము కరిచిందని భయపడకుండా ఉండటం వల్లే గౌతమ్ కు త్వరగా విషం ఎక్కలేదని.. కానీ పాములను స్వయంగా తీసుకు రావడం అవసరం లేదని, అది ఏ పామో చెబితే సరిపోతుందని అన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ అధికారులు అక్కడికి చేరుకొని ఆ పాములను పట్టుకొని అడవిలో వదిలి పెట్టారు.






