- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్కకు సెల్యూట్..! కార్మికులకు మహిళ చేసిన చిన్న సాయం.. నెటిజన్ల ప్రశంసలు
నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తెల్లవారుజాము నుంచే కష్టపడే మున్సిపల్ కార్మికులకు ఓ మహిళ చేసిన చిన్న సాయంపై నెటిజన్‌ల ప్రశంసించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తెల్లవారుజాము నుంచే కష్టపడే మున్సిపల్ కార్మికులకు ఓ మహిళ చేసిన చిన్న సాయంపై నెటిజన్‌ల ప్రశంసించారు. ఉదయం వేళ తన ఇంటి ముందుకు వచ్చిన మున్సిపల్ కార్మికులకు ఆ మహిళ స్వయంగా టీ అందించగా, ఆ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చలి, ఎండ, వాన అనే తేడా లేకుండా నగర ప్రజల ఆరోగ్యం కోసం శ్రమించే కార్మికుల పట్ల ఆ మహిళ చూపిన ఔదార్యం నెటిజన్ల మనసులను హత్తుకుంది. మన సౌకర్యం కోసం వారు పడే కష్టాన్ని గుర్తించి, కనీసం ఒక కప్పు టీ అయినా ఇవ్వాలన్న ఆమె ఆలోచన అభినందనీయం అంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోపై నెటిజన్‌లు స్పందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇలాంటి చిన్న చిన్న పనులే సమాజాన్ని మార్చుతాయని, వారిని గౌరవించిన ఆ అక్కకు సెల్యూట్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఈ ఘటన అందరికీ ఆదర్శంగా నిలవాలని, ప్రతి ఒక్కరూ తమకు సేవ చేసే వారిని గుర్తించి గౌరవించాలని నెటిజన్‌లు అభిప్రాయపడ్డారు. చిన్న సాయం అయినా, అది సమాజంలో పెద్ద మార్పునకు నాంది కావొచ్చని ఓ నెటిజన్ కామెంట్ హైలెట్‌గా నిలిచింది. వీడియో ఇదే..






