- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఛీ.. ఛీ.. మూత్రంతో కళ్లు కడుక్కున్న మహిళ.. (వీడియో)
సోషల్ మీడియాలో వింతలకు కొదువలేదు. ఎవరి పిచ్చి వారిది అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. వైరల్ అవుతూ ఉంటుంది. ఇలాంటిదే మనం చర్చించబోయే టాపిక్ కూడా. ఓ మహిళా యూరిన్‌తో కళ్లు శుభ్రం చేసుకుంది. మూత్రం ఎలా కలెక్ట్ చేయాలి? ఐస్ ఎలా వాష్ చేయాలి

దిశ, వెబ్‌సైట్ : సోషల్ మీడియాలో వింతలకు కొదువలేదు. ఎవరి పిచ్చి వారిది అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. వైరల్ అవుతూ ఉంటుంది. ఇలాంటిదే మనం చర్చించబోయే టాపిక్ కూడా. ఓ మహిళా యూరిన్‌తో కళ్లు శుభ్రం చేసుకుంది. మూత్రం ఎలా కలెక్ట్ చేయాలి? ఐస్ ఎలా వాష్ చేయాలి? అంటూ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీనిపై స్పందిస్తున్న నిపుణులు.. మూత్రం అనేది వ్యర్థమని, అది టాయిలెట్ కిందకు వస్తుందని.. కళ్లకు హాని కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు. మూత్రం యాసిడ్‌ను కలిగి ఉంటుందని.. దృష్టి నష్టం సంభవించవచ్చని తెలిపారు.
యూరిన్ థెరపీ అంటూ ఇలాంటి వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతుండొచ్చు.. కానీ ఇందుకు సంబంధించిన ఆరోగ్య ప్రయోజనాలకు సైంటిఫిక్ ప్రూఫ్స్ లేవని.. వైద్య పరిస్థితులను మరింత కష్టతరం చేయవచ్చని అంటున్నారు నిపుణులు. యూరిన్ థెరపీ అనేది చరిత్రాత్మక, సాంస్కృతిక అభ్యాసం అయినప్పటికీ.. ఆధునిక వైద్య శాస్త్రం ద్వారా సమర్థించబడలేదని తెలిపారు. 2011లో ఒక వ్యక్తి కళ్ళకు మూత్రాన్ని ఉపయోగించిన తర్వాత కంటి చూపు కోల్పోయినట్లు చెప్పారు.






