ప్రేమికులకు చెప్పుల దండ వేసి ఊరేగింపు(వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-11-14 13:55:18  IST  )

ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే ఈ రోజుల్లో సాహసమనే చెప్పాలి. పెళ్లి అయిన తర్వాత కూడా జంటను వేరు చేసి ఇంటికి తీసుకెళ్లడమో.. హత్య చేయడమో చూస్తూనే ఉన్నాం. పరువుకు ప్రాణమిస్తామంటూ కన్న బిడ్డలను

ప్రేమికులకు చెప్పుల దండ వేసి ఊరేగింపు(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే ఈ రోజుల్లో సాహసమనే చెప్పాలి. పెళ్లి అయిన తర్వాత కూడా జంటను వేరు చేసి ఇంటికి తీసుకెళ్లడమో.. హత్య చేయడమో చూస్తూనే ఉన్నాం. పరువుకు ప్రాణమిస్తామంటూ కన్న బిడ్డలను క్రూరంగా పరువు హత్యలు చేయడం జరుగుతూనే ఉంది. ఇలాంటి ఇంటర్ కాస్ట్ ప్రేమికులకే ఝార్ఖండ్‌లోని ఓ గ్రామంలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. ముందుగా పంచాయితీ నిర్ణయం ప్రకారం వారికి పెళ్లి చేసి.. ఆ తర్వాత ఇద్దరి ముఖానికి నల్లటి రంగు పూసి.. చెప్పుల దండలు వేసి ఊరేగించారు. ఈ ఘటనను వీడియో తీసి ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇది ప్రేమ తిరుగుబాటు.. అవమానం కాదు గౌరవం.. ఇది ప్రేమికుల ఓటమి కాదు సమాజం వైఫల్యం’ అంటూ కుల, మత పిచ్చి గురించి ప్రస్తావించారు. ‘అరేంజ్డ్ మ్యారేజ్‌లో ఎన్ని బంధాలనైనా ఒప్పుకుంటారు కానీ విశ్వసనీయ ప్రేమ మాత్రం శిక్షించబడుతుంది’, ‘సమాజం ప్రేమను తప్ప అన్నింటిని అంగీకరిస్తుంది.. ఇలాంటి వారిని జైలులో పెట్టాలి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story