రీల్స్ పిచ్చి.. కదులుతున్న కారుపైకి ఎక్కి స్టంట్లు

by velandi.Saikiran |

భోపాల్‌లో ఒక యువకుడు కదులుతున్న కారు డ్రైవింగ్ సీటును వదిలేసి, ఏకంగా కారు పైకప్పు మీదకు ఎక్కి రీల్ కోసం ఫోజులిచ్చాడు.

youth , stunt , car
X

A video showing a youth performing a dangerous stunt on a moving car went viral

దిశ, వెబ్ డెస్క్‌: సోష‌ల్ మీడియా వినియోగం విప‌రీతంగా పెరిగిన సంగ‌తి తెలిసిందే. జ‌నాల ద‌గ్గ‌ర స్మార్ట్ ఫోన్లు విచ్చ‌ల విడిగా ఉన్న త‌రుణంలోనే సోషల్ మీడియా వినియోగం పెరిగింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక దానికి త‌గ్గ‌ట్టుగానే, సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే... మరికొన్ని భయానకమైనవి దర్శనం ఇస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. రోడ్లపై రీల్స్ చేస్తూ మ‌రి కొంత మంది రచ్చ చేస్తున్నారు. ఫాలోవర్స్ ను పెంచుకునేందుకుగాను రోడ్లపై స్టంట్స్‌ చేసి మరి, రిలీజ్ చేస్తున్నారు. అలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో విపరీతంగానే తెరపైకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన అలాంటిదే జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

రీల్స్ పిచ్చి..కారుపై ఎక్కి స్టంట్స్‌

ఇప్పుడు ఎక్కడ చూసినా రీల్స్ అనే మాట వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చదువుకున్నవాళ్లు, చదువు రాని వాళ్ళు అనే తేడా లేకుండా... చాలామంది రీల్స్ చేసి పాపులర్ అయిపోతున్నారు. ఫన్నీ, కన్నీళ్లు పెట్టించే సంఘటనలు, ట్రావెల్, ఫుడ్, ఫ్రాంక్ వీడియోలు పెట్టి చాలా మంది పాపులర్ అవుతున్నారు. ప్రస్తుత కాలంలో ఇంస్టాగ్రామ్ రీల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. జనాలు కూడా ఇంస్టాగ్రామ్ వినియోగించుకొని రీల్స్ పెట్టేస్తున్నారు. చ‌దువు రాకున్నా, మంచి కంటెంట్ పోస్ట్ చేసి, డ‌బ్బులు సంపాదిస్తున్నారు. అయితే తాజాగా ఈ రీల్స్ పిచ్చితో... రోడ్లపై స్టంట్స్ చేశాడు ఓ యువ‌కుడు. కదులుతోన్న‌ కారుపై ఎక్కి స్టంట్ లు చేసి రచ్చ చేశారు. ఈ సంఘటన భోపాల్ లోని ఓ ఏరియాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

భోపాల్ లో యువ‌కుడి భ‌యంక‌ర‌మైన స్టంట్స్‌

భోపాల్ లోని ఓ ప్రాంతంలో యువకుడు కదులుతోన్న‌ కారుపైకి ఎక్కి రచ్చ చేశాడు. డ్రైవింగ్ సీటు నుంచి బయటకు దిగి.. ఆ కదిలే కారు పైకి ఎక్కాడు. ఎక్కిన అనంతరం ఫోటోలు, రీల్స్ కు ఫోజులు కూడా ఇచ్చాడు. డ్రైవర్ లేకుండానే కారు రోడ్డుపై వెళ్తుండగా అతను చేసిన ఈ ప్రమాదకరం సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సంఘటన చూసిన నెటిజెన్స్ చాలా సీరియస్ అవుతున్నారు. అలాంటి పనులు చేసే వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ కారు వెళ్లి మరో వ్యక్తికి ప్రమాదం చేస్తే పరిస్థితి ఏంటి? లేదా రిల్సీ చేసిన వ్యక్తి మరణిస్తే అతని కుటుంబ పరిస్థితి ఏంటి అంటూ నెటిజన్స్ నిలదీస్తున్నారు. ఇలాంటి వారిని జైల్లో పెట్టాలని కోరుతున్నారు. ఇక ఈ వీడియో వైర‌ల్ అయిన త‌రుణంలోనే భోపాల్ పోలీసులు అల‌ర్ట్ అయ్యార‌ట‌. ఈ సంఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని, ఆ యువ‌కుడిని అరెస్ట్ చేసిన‌ట్లు చెబుతున్నారు.

Next Story