Viral video : అరేయ్ ఏంట్రా అది..! పిల్లలు కాదు రా మీరు.. ముదుర్లు..!!

by Javid Pasha |

Viral video : అరేయ్ ఏంట్రా అది..! పిల్లలు కాదు రా మీరు.. ముదుర్లు..!!

Viral video : అరేయ్ ఏంట్రా అది..! పిల్లలు కాదు రా మీరు.. ముదుర్లు..!!
X

దిశ, ఫీచర్స్ : ఏందో భయ్యా.. సోషల్ మీడియా పుణ్యమా అని వెరైటీలన్నీ మన కంటనే పడుతుంటాయేమో అనిపిస్తుంది ఒక్కోసారి.. అంటూ చమత్కరిస్తుంటారు కొందరు. ఒక విధంగా చెప్పాలంటే పరిస్థితి అట్లనే తయారైంది మరి! స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉన్నాక ఎవరు మాత్రం ఊరుకుంటారు చెప్పండి! ముఖ్యంగా ఇంటర్నెట్ యాక్సెస్ ఈజీ అయ్యాక ప్రతీ ఒక్కరి లైఫ్ మారిపోయింది. ఈ ప్రభావమే కాబోలు.. అలా ఓపెన్ చేస్తే చాలు మనల్ని అలరించే బోలెడంత వైరల్ కంటెంట్ కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. అలాంటి క్యూరియా‌ సిటీని పెంచే వీడియో ఒకటి ప్రజెంట్ వైరల్ అవుతోంది.

వైరల్ సమాచారం ప్రకారం.. బహుశా ఏడాది వయసున్న ఓ చిన్న బాబు, అతని తండ్రి తమ ఇంటిలోని బెడ్‌పై కూర్చొని ఉంటారు. అంతలోనే ఆ చిన్న బాబుకి ఠక్కున ఫోన్ గుర్తొచ్చినట్టుంది. ఏడుస్తూనే తండ్రి చేతిలోని ఫోన్ లాక్కుంటాడు. అయితే అది ఫింగర్ ప్రింట్ లాక్ వేసి ఉన్నందున ఓపెన్ కాదు. దీంతో ఆ బుడ్డోడు తన తండ్రి చేతి వేలును లాక్కొని ఫోన్ స్క్రీన్‌పై నొక్కగానే ఓపెన్ అవుతుంది. అలా లాక్ ఓపెన్ కాగానే వెంటనే ఫోన్ అందుకొని స్ర్కోల్ చేసే ప్రయత్నం చేస్తాడు. ‘Bro don’t know about his age limit’ అనే క్యాప్షన్‌తో ‘viralbox143’ అనే ఇన్‌స్టా హ్యాండిల్లో ఈ వీడియోను షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు సైతం క్యూరియాసిటీతో రియాక్ట్ అవుతున్నారు.

Next Story