- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Robot in farm work : వ్యవసాయం చేస్తున్న రోబో..! మనుషులతోపాటు పొలం చదును చేస్తూ.. (వీడియో)
Robot in farm work : వ్యవసాయం చేస్తున్న రోబో..! మనుషులతోపాటు పొలం చదును చేస్తూ.. (వీడియో)

దిశ, ఫీచర్స్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. అనేక రంగాల్లో విస్తరిస్తోంది. సరికొత్త మార్పులకు దారితీస్తోంది. ఇప్పటికే ఏఐ ఆధారిత హ్యూమనాయిడ్ రోబోలు ఆయా పనుల్లో మానవులకు తోడ్పడుతున్నాయి. ఇంటి పనులు మొదలు కొని ఇండస్ట్రీయల్ వర్క్ వరకు తమదైన పద్ధతిలో సహాయపడుతున్న రోబోలకు సంబంధించిన వీడియోలు తరచుగా వైరల్ అవుతుండటం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా అలాంటిదే మరో సరికొత్త వీడియో నెట్టింట హల్ చల్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇంతకీ అదేం చేసిందంటే..
వైరల్ వీడియో ఇన్ఫర్మేషన్ ప్రకారం.. అది ఎత్తైన కొండ ప్రాంతం. అయినప్పటికీ వ్యవసాయానికి అనుగుణంగా స్థానిక ప్రజలు అక్కడి నేలను చదును చేశారు. వంకర్లు తిరిగిన గుట్టలపై వరి పండించడానికి అనుగుణంగా మడులు నిర్మించారు. అక్కడ పనిచేస్తు్న్న జనాలను బట్టి చూస్తే బహుశా అది చైనా దేశంలోని గ్రామీణ పర్వప్రాంతం అయి ఉంటుంది. విషయం ఏంటంటే.. ఇక్కడ వరిపంట నాటడానికి మడులను సిద్ధం చేస్తున్న ప్రజలతో పాటు ఒక రోబో కూడా ఉంది. అచ్చం మనుషుల మాదిరిగానే మట్టిని చదును చేయడం, మడులు నిర్మించడం వంటి పొలం పనులను చక్కగా చేస్తోంది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ క్యూరియాసిటీని పెంచుతోంది.






