Viral Video: మిమిక్రీ చేస్తున్న పక్షి.. పోలీసుల్లో కొత్త టెన్షన్.. వీడియో వైరల్

by Disha Web Desk 3 |
Viral Video: మిమిక్రీ చేస్తున్న పక్షి.. పోలీసుల్లో కొత్త టెన్షన్.. వీడియో వైరల్
X

దిశ వెబ్ డెస్క్: రహదారి పక్కనే ఉన్న పచ్చని చెట్టుపై ప్రశాంతంగా కూర్చుని పోలీసులను సైతం ఓ పక్షి పరేషాన్ చేస్తోంది. కొమ్మల్లో దాక్కుని పోలీస్ సైరన్‌ను ఇమిటేట్ చేస్తూ పోలీసులను పరుగులు పెటించింది. ఈ ఘటన లండన్‌ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లండన్ లోని థేమ్స్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పక్కన ఓ చెట్టు ఉంది. ఆ చెట్టుపై ఓ పక్షి నివాసం ఏర్పరుచుకుంది.

ఈ నేపథ్యంలో ఆ పక్షి రోజు పోలీస్ వాహనాలు చేసే సైరెన్ శబ్దాలను వింటూ ఉండేది. అయితే తాజాగా ఆ పోలీసు వాహనాల సైరెన్‌ను అనుకరించడం మొదలుపెట్టింది. అచ్చం పోలీసు వాహనాల సైరెన్ లాగా కూత పెట్టింది. దీనితో అటు ఆ రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు తమని పోలీసులు వెంబడిస్తున్నారని అనుకున్నారు, అలానే ఎదుకు వెంబడిస్తున్నారో వాళ్లకు అర్ధం కాక అయోమయానికి గురైయ్యారు.

ఇటు పోలీసులు సైతం వాహాల సైరెన్ ఎలా వస్తుందో అర్ధం కాక పరేషాన్ అయ్యారు. ఎవరు వాహనాలను ఉపయోగిస్తున్నారు అని అటు ఇటు పరుగులు పెట్టారు. దీనితో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా గందరగోళం నెలకొంది. ఇక ఈ సైరన్ ఎక్కడ నుండి వస్తుందా అని పోలీసులు జాగ్రత్తగా వెతకగా, పక్కనే ఉన్న చెట్టు కొమ్మల నుంచి వస్తోందని, ఇదంతా ఓ తుంటరి పక్షి నిర్వాకమని గుర్తించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోని మీరు ఒకసారి చూసేయండి.


Next Story

Most Viewed