జస్ట్ మిస్...తెలివిగా లేడీ ఎస్కేప్..స్కూటీ తుక్కు తుక్కు

by velandi.Saikiran |

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. జియో వచ్చిన తర్వాత సోషల్ మీడియా వాడకం కూడా విపరీతంగా పెరిగిన నేపథ్యంలో

జస్ట్ మిస్...తెలివిగా లేడీ ఎస్కేప్..స్కూటీ తుక్కు తుక్కు
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. జియో వచ్చిన తర్వాత సోషల్ మీడియా వాడకం కూడా విపరీతంగా పెరిగిన నేపథ్యంలో.. ప్రతి చిన్న విషయం కూడా ప్రజలకు తెలిసిపోతుంది. మొబైల్ ఓపెన్ చేస్తే చాలు రకరకాల వీడియోలు... రావడంతో జనాలు కూడా అన్ని తెలుసుకుంటున్నారు. అయితే తాజాగా ఓ యాక్సిడెంట్ వీడియో వైరల్ గా మారింది.

ఎక్కడ జరిగిందో తెలియదు కానీ... ఓ వ్యాన్ చేసిన రచ్చ కారణంగా... ఓ లేడీ కి సంబంధించిన స్కూటీ తుక్కు తుక్కు అయింది. ఇటుకలతో వెళుతున్న ఓ వ్యాన్ వెనుక... స్కూటీ నడుపు ఓ మహిళ వెళ్లింది. అయితే వెళ్తూ ఉండగానే ఒక్కసారిగా వ్యాన్ ఆగిపోయింది. ఆగిపోయిన వ్యాన్ ముందుకు వెళ్లకుండా వెనక్కి వచ్చింది.

అయితే ఇది గమనించిన.. స్కూటీ నడిపే మహిళ.. వెంటనే దూకేసింది. అయితే స్కూటీపై నుంచి వ్యాన్ వెళ్ళింది. ఈ నేపథ్యంలో స్కూటీ తుక్కు తుక్కు కాగా.. మహిళ మాత్రం ప్రాణాలతో బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ జస్ట్ మిస్.. కొంచెం అయితే ఆమె ప్రాణాలు పోయేవి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. డ్రైవర్ నిద్రపోతున్నాడని మండిపడుతున్నారు. ఇక ఈ సంఘటనపై పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు సమాచారం అందుతుంది.

Next Story