- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Video : నడిరోడ్డుపై షో చేసిన బైకర్..అంతలోనే ట్రక్కు వచ్చి !
నడిరోడ్డుపై షో చేసిన బైకర్ ను ట్రక్కు వచ్చి ఢీ కొట్టిన వీడియో వైరల్ గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ, ఈ ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతి వేగం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే లేటెస్ట్ గా అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. నడిరోడ్డు పైన టూ వీలర్ తో షో చేసిన ఓ బైకర్ ను మినీ ట్రక్ ఢీ కొట్టింది. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.
తమిళనాడులోని ఓ ప్రాంతంలో సైడ్ కు ప్లేస్ ఉన్నప్పటికీ, నడిరోడ్డుపై తన టూ వీలర్ వాహనాన్ని నిలబెట్టాడు. భారీ వాహనాలు వచ్చినా, సైడ్ ఇవ్వలేదు. ఈ క్రమంలో వెనక నుంచి వచ్చిన ఓ ట్రక్ అతన్ని ఢీ కొట్టింది. దీంతో ఆ టూ వీలర్ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్, తమ స్టైల్ లో స్పందిస్తున్నారు. పీకలదాకా తాగేసి, బైకర్ అలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఫైర్ అవుతున్నారు. క్లిక్






