- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెల జీతం రూ.70 వేలు.. ELEVEN స్పెల్లింగ్ కూడా రాని టీచర్
నెలకు రూ.70 వేలు తీసుకుంటున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయునికి ELEVEN స్పెల్లింగ్ కూడా రాయడం రాకపోవడంతో అధికారులు షాక్ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్ : నెలకు రూ.70 వేలు తీసుకుంటున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయునికి ELEVEN స్పెల్లింగ్ కూడా రాయడం రాకపోవడంతో అధికారులు షాక్ అయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యాశాఖ అధికారులు తనిఖీలు జరిపారు. తీవ్ర చర్చకు దారితీసింది. ఈ తనిఖీల్లో సురేంద్ర దీక్షిత్ అనే ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు "ELEVEN" అనే పదాన్ని సరిగ్గా రాయలేకపోయాడు. నెలకు రూ.70 వేలు తీసుకుంటూ... 11, 12వ తరగతులకు బోధిస్తున్న ఈ సీనియర్ ఉపాధ్యాయుడు "ELEVEN" స్పెల్లింగ్‌ను "ALAVEN"గా తప్పుగా రాశాడు.
విద్యార్థులను పరీక్షిద్దామని వచ్చిన అధికారులకు ఉపాధ్యాయునికే సరిగా చదువు రాకపోవడంతో ఖంగుతిన్నారు. అయితే ఈ ఘటనను అక్కడున్న విద్యార్థులు సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. బలరాంపూర్ జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.






