6 అడుగుల కుక్క...150 కిలోల బరువు.. ఈ వీడియో చూస్తే !

by velandi.Saikiran |

6 ఫీట్ల కుక్క వైరల్ గా మారింది. అంతేకాదు ఆ కుక్క బరువు దాదాపు 100 నుంచి 150 కిలోలు ఉంటుందని తెలుస్తోంది

6 అడుగుల కుక్క...150 కిలోల బరువు.. ఈ వీడియో చూస్తే !
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో జంతువుల వీడియోలు కూడా వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఓ అరుదైన కుక్క ( Dog) వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అత్యంత పొడవైన కుక్కను ఈ వీడియోలో మనం చూడవచ్చు.

వాస్తవంగా ఓ కుక్క రెండు ఫీట్ల పొడవు, మూడు ఫీట్ల వెడల్పు ఉంటుంది. అంతకంటే ఎక్కువ హైట్ ఉన్న కుక్కలు మనం ఎప్పుడూ చూడం. అయితే.. తాజాగా 6 ఫీట్ల కుక్క ( Tallest Dog) సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఆ కుక్క బరువు దాదాపు 100 నుంచి 150 కిలోలు ఉంటుందని తెలుస్తోంది. ఆ కుక్కను ఓ విదేశీయుడు పెంచుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. ఆవులు అలాగే గేదెలను పెంచుకున్నట్లుగానే ఆ కుక్కను కూడా సదరు వ్యక్తి పోషిస్తున్నాడు.

తన సంపాదన లో దాదాపు 30 శాతం ఆ కుక్కకు పెడుతున్నట్టు తెలుస్తోంది. మనిషి హైట్ ఉన్న ఈ కుక్క వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసినా నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏఐ ద్వారా ఆ కుక్క హైట్ ఎక్కువగా ఉన్నట్లు చూపిస్తున్నారని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే.. అది స్పెషల్ బ్రీడ్ అని మరి కొంతమంది అంటున్నారు. స్పెషల్ బ్రీడ్ కాబట్టి హైట్ ఉందని కామెంట్స్ పెడుతున్నారు.

Instagramme Link

Next Story