‘ఇదేం బ్రిడ్జిరా బాబూ’.. పర్మిషన్ ఇచ్చినోడికి మొక్కాలి!

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-14 15:38:59  IST  )

కొంత మంది ఇంజినీర్ల పనితీరు చూస్తే వావ్ అని అనిపిస్తుంది. ఇంకొంతమంది ఇంజినీర్ల పనితీరు చూస్తే చీ అనిపిస్తుంది.

‘ఇదేం బ్రిడ్జిరా బాబూ’.. పర్మిషన్ ఇచ్చినోడికి మొక్కాలి!
X

దిశ, వెబ్‌డెస్క్: కొంత మంది ఇంజినీర్ల పనితీరు చూస్తే వావ్ అని అనిపిస్తుంది. ఇంకొంతమంది ఇంజినీర్ల పనితీరు చూస్తే చీ అనిపిస్తుంది. తాజాగా ఇలాంటి ఇంజినీర్ పనితీరే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన నిర్మించిన బ్రిడ్జి(Railway Bridge) చూస్తే బూతులు ఆపుకోలేరు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రంలోని భోపాల్ సిటీ సమీపంలో ఐష్ బాగ్ అనే ప్రాంతం ఉంది. ఇది నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. జనావాసాల్లోనే రైల్వే ట్రాక్ కూడా ఉంది. అయితే ఈ రైల్వే గేటు దగ్గర ప్రయాణికులు రోజూ కాళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే మరింత ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో దీన్ని దృష్టిలో ఉంచుకుని పదేళ్ల క్రితం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు అధికారులు.

తాజాగా ఈ బ్రిడ్జి నిర్మాణం దాదాపు పూర్తయి.. ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. విచిత్రమైన ఆకారంలో నిర్మించిన ఆ రైల్వేఓవర్‌ బ్రిడ్జ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. బ్రిడ్జ్‌ నిర్మాణానికి స్థలం కొరత కారణంతో ఓ ఇంజినీర్‌ బ్రిడ్జ్‌ను ఎల్‌ ఆకారంలో నిర్మించాడు. అయితే బ్రిడ్జ్‌ ఎండింగ్‌ 90 డిగ్రీస్‌తో ఉండడంతో ప్రమాదాలు జరగవచ్చని నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో బ్రిడ్జ్‌ ప్రారంభానికి ముందే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి డిజైన్ ఇచ్చినోడికి, దాన్ని చూసి పర్మిషన్ ఇచ్చినోడికి దండ వేసి దండం పెట్టినా తప్పులేదని తీవ్ర స్థాయిలో విమర్శుల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్రిడ్జి ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Click For Tweet..

Next Story