- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Benguluru : సినిమాను తలపించిన దొంగతనాల కథ
ధనవంతుల నుంచి డబ్బు దొంగలించి(Robbery) పేదలకు సహాయం చేసే రాబిన్ హుడ్(Rabin Hood) కథలు సినిమాల్లో చూస్తూ ఉంటాం.

దిశ, వెబ్ దేశల : ధనవంతుల నుంచి డబ్బు దొంగలించి(Robbery) పేదలకు సహాయం చేసే రాబిన్ హుడ్(Rabin Hood) కథలు సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఉదాహరణకు హీరో రవితేజ నటించిన కిక్ సినిమా(Kick Film)లో రవితేజ అక్రమార్కుల దగ్గర, బాగా డబ్బు ఉన్నవారి దగ్గర డబ్బులు కొట్టేసి.. పేద పిల్లల వైద్యం కోసం ఖర్చు చేస్తూ ఉంటాడు. హీరో చేసేది దొంగతనమే అయినా.. మంచి కోసం ఖర్చు చేస్తూ ఉంటాడు కాబట్టి సినిమా సూపర్ హిట్ అయింది. నిజ జీవితంలో జరిగితే జనం దృష్టిలో, చట్టం దృష్టిలో నేరస్థుడు అవుతాడు. అయితే నిజంగా అలాంటి ఘటనే బెంగుళూరు(Benguluru)లో జరిగింది.
శివు అనే వ్యక్తి రూ.22 లక్షల విలువైన బంగారాన్ని దొంగతనం(Robbery) చేసి.. పోలీసులకు దొరికిపోయాడు. అయితే పోలీసుల విచారణలో 20 మంది పేద పిల్లల చదువు కోసమే తాను దొంగతనం చేసినట్టు పేర్కొన్నాడు. ఈ విషయం బయటకి తెలియడంతో అంతా అతన్ని "బెంగుళూరు రాబిన్ హుడ్"(Benguluru Rabin Hood) గా పిలుస్తున్నారు.






