- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోట్లు విలువ చేసే రాయి.. ఎలా ఉపయోగించారో తెలిస్తే షాకవుతారు!
ఇప్పుడంటే డోర్ స్టాపర్లు (Doorstops) వచ్చాయి కాబట్టి, తలుపులు పదే పదే మూసుకుపోకుండా వీటిని వాడుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఇప్పుడంటే డోర్ స్టాపర్లు (Doorstops) వచ్చాయి కాబట్టి, తలుపులు పదే పదే మూసుకుపోకుండా వీటిని వాడుతున్నారు. కానీ, ఇవి రాకముందు తలుపులకు అడ్డుగా రాళ్లను (Stones) పెట్టేవారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని పాత కాలం ఇళ్లలో ఇలా తలుపులకు రాళ్లు అడ్డు పెట్టడం మనం చూడొచ్చు. అయితే, ఇలా అడ్డుగా పెట్టిన ఓ రాయి గురించి ఆసక్తికరమైన (Interesting) విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అదేంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. మరీ ఎందుకు ఆలస్యం ఈ స్టోరీ చదివేయండి.
యూరప్ (Europe) ఖండంలోని రొమేనియా (Romania) దేశంలో కోల్టి అనే గ్రామానికి చెందిన ఓ పెద్దావిడ ఇంట్లో తలుపుకు అడ్డుగా ఓ పెద్ద రాయిని పెట్టింది. దాన్ని ఆవిడ అక్కడి సమీపంలోని నది దగ్గర నుంచి పట్టుకొచ్చుకుంది. కొన్నేళ్ల పాటు దానిని తలుపుకి అడ్డురాయిగా వాడింది. అయితే అది మాములు రాయి కాదు. దాదాపు 3.5 కిలోల బరువున్న అరుదైన అంబర్ రుమనైట్ అని తర్వాత తెలిసింది. దాని విలువ ఏకంగా కోట్లలో ఉంటుంది. అయితే, ఈ విషయం తెలిసే నాటికే ఆ పెద్దావిడ చనిపోయింది.
1991లో ఆమె చనిపోయిన తర్వాతే బంధువుల్లో ఒకరు.. తలుపు దగ్గర ఉన్న ఆ రాయిని గమనించి పరిశీలించారు. అది మాములు రాయి కాదని తెలుసుకుని, అతడు దానిని 1.1 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.10 కోట్లు) రొమేనియా ప్రభుత్వానికి అమ్మేశాడు. వెంటనే అక్కడి ప్రభుత్వం మరిన్ని పరీక్షల కోసం దాన్ని పోలాండ్‌లోని క్రాకోవ్‌కు పంపించగా, అది 38.5 నుంచి 70 మిలియన్ల వయసు ఉన్న అంబర్ రాయి అని తేలింది. అంతేకాదు, ప్రపంచంలోనే అతిపెద్ద అంబర్ రుమనైట్లలో ఒకటిగా గుర్తించారు. ప్రస్తుతం ఈ రాయిని మ్యూజియంలో ఉంచారు.
అయితే, ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఆ పెద్దావిడ ఇంట్లో రెండుసార్లు దొంగలు పడి.. ఇంట్లోని విలువైన వస్తువులు బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. కానీ, ఆ రాయిని మాత్రం గుర్తించలేకపోయారు.
అంబర్ రుమనైట్ అంటే ఏంటంటే?
సాధారణంగా చెట్లు జిగురును విడుదల చేస్తాయని తెలుసు. అయితే, లక్షల సంవత్సరాల క్రితం నాటి చెట్ల జిగురు శిలాజంగా (fossilized tree resin) మారి.. ఆకర్షణీయమైన రాయిగా రూపాంతరం చెందుతుంది. వీటిని ఆభరణాలుగా, రత్నాల్లాంటి విలువైన రాళ్లుగా వాడతారు. సంప్రదాయ వైద్యంలోనూ దీన్ని ఉపయోగిస్తారు. ముడి రూపంలో ఉండే ఈ అంబర్ రాళ్లు.. రకరకాల ఆకారాల్లో, విభిన్నమైన రంగుల్లో, పరిమాణాల్లో ఉంటాయి.






