‘రామ్ కీ పైడీ’పై అద్భుత దృశ్యం.. నింగిలో కనువిందు చేసిన అరుదైన ‘బ్లూ మూన్’

by Kema Shiva Kumar |

అయోధ్యలోని ప్రముఖ ‘రామ్ కీ పైడీ’ ఘాట్‌పై అరుదైన ‘బ్లూ మూన్’ వెలుగులు విరజిమ్మింది.

‘రామ్ కీ పైడీ’పై అద్భుత దృశ్యం.. నింగిలో కనువిందు చేసిన అరుదైన ‘బ్లూ మూన్’
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం అయోధ్యలో ఇవాళ రాత్రి ఓ అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతమైంది. సరయూ నది తీరాన ఉన్న ప్రసిద్ధ ‘రామ్ కీ పైడీ’ (Ram Ki Paidi) పరిసరాల్లో అరుదైన ‘బ్లూ మూన్’ (Blue Moon) వెలుగులు విరజిమ్మింది. అయితే, కాంతులీనుతూ ప్రకాశించిన చందమామ దృశ్యాలు భక్తులను, స్థానికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకు సంబంధించిన అద్భుతమైన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

‘బ్లూ మూన్’ అంటే..

ఖగోళ శాస్త్రం ప్రకారం సాధారణంగా ప్రతి నెలో పౌర్ణమి రావడం సహజం. అయితే, ఒకే క్యాలెండర్ నెలలో వచ్చే రెండో పౌర్ణమిని శాస్త్రవేత్తలు ‘బ్లూ మూన్’ అని పిలుస్తారు. ఇది ఓ అరుదైన ఖగోళ వింతగా భావిస్తారు. పేరులో ‘బ్లూ’ అని ఉన్నప్పటికీ చందమామ నీలం రంగులోకి మారదు, కానీ సాధారణ రోజుల కంటే మరింత పెద్దదిగా, వెలుతురుతో ఆకాశంలో ప్రత్యేకంగా దర్శనమిస్తుంది. అయోధ్య రామ మందిర నగరంలో ఈ అరుదైన చంద్రుడు ప్రకాశిస్తుండటంతో ఆ దృశ్యాన్ని తిలకించడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

Next Story