- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ రెస్టారెంట్ నిండా కండోమ్‌లే..సోంపుకు బదులు ఫ్రీగానే ఆ ప్యాకెట్లు !
ఉషా కిరణ్ అంబటి అనే తెలుగు యూట్యూబర్ ఎక్కువగా బ్యాంకాక్ వీడియోలు తరచూ పెడుతూ ఉంటుంది

దిశ, వెబ్ డెస్క్: కండోమ్‌లు.. ఈ పదం అందరూ వినే ఉంటారు. HIV లాంటి ప్రమాదకరమైన వ్యాధులు సోపకుండా, ముందు జాగ్రత్తలో భాగంగా కండోమ్‌లు వాడాలని ప్రచారం చేస్తూ ఉంటారు. వీటిని ప్రచారం చేసే క్రమంలో రక రకాల మాధ్యమాలను ఎంచుకొని, ప్రభుత్వాలు ముందుకు వెళ్తాయి. అయితే థాయిలాండ్ లో ఏకంగా ఈ కండోమ్‌ల పేరుతోనే రెస్టారెంట్ పెట్టేశారు. ఆ రెస్టారెంట్ లో చాక్లెట్లు, సోంపులకు బదులు ఉచితంగానే కండోమ్స్ ఇచ్చే ఆఫర్ కూడా పెట్టేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉషా కిరణ్ అంబటి అనే తెలుగు యూట్యూబర్ ఎక్కువగా బ్యాంకాక్ వీడియోలు తరచూ పెడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె క్యాబేజీలు & కండోమ్‌లు అనే రెస్టారెంట్ కు వెళ్ళింది. అంతేకాదు ఆ రెస్టారెంట్ లో కండోమ్‌లు గురించి స్పెషల్ వీడియో కూడా పెట్టేసింది. ఆమె వీడియో ప్రకారం, ఈ రెస్టారెంట్ థాయిలాండ్ లో ఉంది. క్రిస్మస్ వస్తున్న నేపథ్యంలో ఈ రెస్టారెంట్ లో మొత్తం కండోమ్‌లతో నింపేశారు. ఎంట్రీలోనే క్రిస్మస్ చెట్టుకు కండోమ్ ప్యాకెట్లు తగిలించారు.
వాటికి అద్భుతమైన లైటింగ్స్ కూడా పెట్టారు. ఈ చెట్టు అందరిని ఆకట్టుకుంటోంది. అలాగే మిస్ కండోమ్ అంటూ ఓ లేడీ బొమ్మకు మిస్ ఇండియా రేంజ్ లో డ్రెస్సింగ్ కూడా వేశారు. అటు మిస్టర్ కండోమ్‌లు అంటూ మరో బొమ్మకు మగాళ్ళ డ్రెస్ వేసి, షాక్ ఇస్తున్నారు. ఇక రెస్టారెంట్ లో ఎక్కడ చూసినా కండోమ్‌లు ప్యాకెట్లే దర్శనం ఇస్తున్నాయి. మనం తిని తాగిన తర్వాత, ప్రతి రెస్టారెంట్ సోంపు లేదా చాక్లెట్ ఇస్తూ ఉంటుంది. కానీ ఈ రెస్టారెంట్ లో ఉచితంగా కండోమ్‌లు ప్యాకెట్లు ఇస్తున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. క్లిక్






