ఈ పాప చేసిన పనికి ఎవరైనా ఫిదా కావాల్సిందే..!

by Dishafeatures2 |
ఈ పాప చేసిన పనికి ఎవరైనా ఫిదా కావాల్సిందే..!
X

దిశ, వెబ్ డెస్క్: చిన్న పిల్లలను ‘నువ్వు పెద్దాయ్యాక ఏమవుతావు’ అని అడిగితే పోలీసో.. ఆర్మీ ఆఫీసరో అని టక్కున సమాధానం చెబుతారు. పోలీసులంటే వాళ్లకు అంత ఇష్టం మరి. తాజాగా కేరళలో జరిగిన ఓ సంఘటన గురించి తెలిస్తే ఇది నిజమనకతప్పదు. ఆరెంజ్ కలర్ ఫ్రాక్ వేసుకున్న నేహాకుట్టీ అనే ఓ మూడేళ్ల పాప ఏమాత్రం భయపడకుండా కోస్టల్ పోలీస్ స్టేషన్ కు చెందిన బిజూ అనే సర్కిల్ ఇన్స్ పెక్టర్ వద్దకు వెళ్లి అతడి ఎదురుగా నిలబడింది. వేరే వ్యక్తితో ఏదో విషయం మాట్లాడుతున్న సీఐ.. పాప వచ్చి ఎదురుగా నిలబడేసరికి ఆసక్తిగా ఆమె వంకే చూశారు. ఆ బాలిక వెంటనే తన కుడి చేతిని పైకెత్తి ఆ పోలీసుకు సెల్యూట్ చేసింది.

వెంటనే ఆ సీఐ కూడా ఆ బాలికకు ప్రతి సెల్యూట్ చేశారు. అనంతరం ఆ పాప నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇక ఆ సీఐ కూడా చిరునవ్వు చిందిస్తూ కనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కేరళ పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేయగా బాగా వైరల్ అయ్యింది. అంత చిన్న వయసులో పోలీసులంటే ఆ పాపకు ఉన్న ఇష్టాన్ని చూసి సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ వీడియోకు ఇప్పటి వరకు మూడున్నర లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

Next Story