దడ పుట్టిస్తున్న గ్యాస్ లీకేజీ ఘటన.. కొంచెం నిర్లక్ష్యంగా ఉన్న ఏమయ్యేదో!?(వీడియో)

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-23 06:45:46  IST  )

సోషల్ మీడియాలో షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో భయాందోళనకు గురిచేస్తోంది.

దడ పుట్టిస్తున్న గ్యాస్ లీకేజీ ఘటన.. కొంచెం నిర్లక్ష్యంగా ఉన్న ఏమయ్యేదో!?(వీడియో)
X

దిశ,వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో భయాందోళనకు గురిచేస్తోంది. ఓ మహిళ వంట చేస్తుండగా స్టవ్‌ కు ఉన్న గ్యాస్‌ పైప్‌ ఒక్కసారిగా ఊడిపోవడంతో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ తరుణంలో వంటగదిలో ఉన్న మహిళ అప్రమత్తమయ్యారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా.. జూన్ 18వ తేదీన మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ వంటగదిలో వంట చేస్తున్న సమయంలో స్టవ్‌కు అమర్చిన గ్యాస్ పైపు ఒక్కసారిగా ఊడిపోయింది. ఈ క్రమంలో గ్యాస్ వేగంగా లీక్ అవుతుంది.ఈ తరుణంలో వంటగదిలో ఉన్న మహిళ అప్రమత్తమయ్యారు. వెంటనే సిలిండర్‌ను వంట గది నుంచి హాల్‌కి తీసుకొచ్చారు.

కిచెన్‌తో పాటు హాల్‌ తలుపులు, కిటికీలు తెరిచి ఉంచటంతో గ్యాస్‌ మొత్తం బయటకు వెళ్లిపోయింది. కొంచెం సేపటి తర్వాత ఆ మహిళ మరో వ్యక్తి సహాయంతో సిలిండర్‌ను పైకి లేపడానికి ప్రయత్నించారు. అదే సమయంలో వంటగదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది. ఈ క్రమంలో మంటలు గదులన్నింటిలోకి వ్యాపించాయి. వెంటనే ఆ వ్యక్తి, మహిళా బయటకు పరుగులు పెట్టారు. ఈ నేపథ్యంలో అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పెను ప్రమాదం తప్పింది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన దృశ్యాలు గదిలో అమర్చిన సీసీ కెమెరాలో రికార్డైయ్యాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో వీడియో వైరల్‌(Video Viral) అవుతోంది. ఈ ఘటనలో కొంచెం నిర్లక్ష్యంగా ఉన్న భారీ ప్రమాదం జరిగేదని, మహిళా ధైర్యానికి నెటిజన్లు ప్రశంసలు తెలుపుతున్నారు. వంటగదిలో వంట చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Next Story