భయానకమైన ప్రదేశం.. ఎటు చూసినా పుర్రెలు, ఎముకలే దర్శనం.. ఎక్కుడుందంటే?

by Yella Dhawani Reddy |

మనలో చాలా మందికి పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొనే వస్తువులపై ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే అవి కేవలం వస్తువులు మాత్రమే కాదు..

భయానకమైన ప్రదేశం.. ఎటు చూసినా పుర్రెలు, ఎముకలే దర్శనం.. ఎక్కుడుందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: మనలో చాలా మందికి పురావస్తు శాస్త్రవేత్తలు (Archaeologists) కనుగొనే వస్తువులపై ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే అవి కేవలం వస్తువులు మాత్రమే కాదు.. అవి శతాబ్దాల క్రితం జీవించిన మన పూర్వీకుల కథలను, వారి సంస్కృతిని, జీవన విధానాన్ని తెలియజేసే సాక్ష్యాలు. ఈ క్రమంలోనే, తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు ఒక అతి పురాతన గుహను కనుగొన్నారు. అందులో బయటపడిన ఒక సర్కోఫాగస్ (Sarcophagus) (శవపేటిక) సహా వందలాది అస్థిపంజరాలు చరిత్ర పరిశోధకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఎందుకంటే.. ఎటు చూసిన పుర్రెలు (skulls), ఎముకలతో ఈ గుహ అత్యంత భయానకంగా ఉంది.

తాజాగా కనుగొన్న ఈ ప్రదేశం శతాబ్దాలుగా అజ్ఞాతంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కనుగొనబడిన అవశేషాలు ఒక పురాతన నాగరికతకు సంబంధించినవిగా వారు భావిస్తున్నారు. సర్కోఫాగస్ చుట్టూ ఉన్న అస్థిపంజరాలు, ఇతర వస్తువులను పరిశీలిస్తుంటే.. పూర్వం ఈ స్థలాన్ని పెద్ద సమాధి క్షేత్రంగా ఉపయోగించనుట్లుగా తెలుస్తోంది. ఇక పరిశోధకులు సర్కోఫాగస్‌ను జాగ్రత్తగా తెరిచినప్పుడు, లోపల మరింత ఆసక్తికరమైన వస్తువులు బయటపడ్డాయి. ఇవి పురాతన నాగరికత సంస్కృతి, సాంకేతికత జీవన విధానాన్ని తెలియజేసేలా ఉన్నాయి. అంతేకాదు, ఇక్కడ ఖననం చేసిన వ్యక్తులు ప్రాముఖ్యతను కూడా సూచిస్తున్నాయి. ఇక ఈ విషయాలను మరింత లోతుగా అధ్యయనం చేయడం ద్వారా చరిత్రలోని అనేక రహస్యాలను వెలికితీసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ ప్రదేశం ఎక్కడ కనుగొనబడిందనే పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు.

Next Story