- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లాటరీ చరిత్రలోనే అరుదైన గెలుపు.. రూ.2 వేల కోట్లు బహుమతి గెలుచుకున్న ఐర్లాండ్ వ్యక్తి
మనం నిత్యం వార్తల్లో చూస్తుంటాం.. 'లాటరీలో లక్షలు గెలిచాడు', 'ఒకే ఒక్క టికెట్ తో కోట్ల రూపాయలు దక్కించుకున్నాడు' అనే హెడ్‌లైన్‌లు మనకు కొత్త కాదు.

దిశ, వెబ్ డెస్క్: మనం నిత్యం వార్తల్లో చూస్తుంటాం.. 'లాటరీలో లక్షలు గెలిచాడు', 'ఒకే ఒక్క టికెట్ తో కోట్ల రూపాయలు దక్కించుకున్నాడు' అనే హెడ్‌లైన్‌లు మనకు కొత్త కాదు. ఓసారి అదృష్టం తలుపు తడితే.. సాధారణ సామాన్య వ్యక్తుల జీవితాలు కూడా అద్భుతమైన మలుపు తిరుగుతాయని ఈ వార్తలు చెబుతుంటాయి. కానీ, ఇప్పుడు చెప్పబోయే ఈ లాటరీ విజేత విషయమైతే పూర్తిగా భిన్నం. ఇది కేవలం కోట్లు గెలుచుకున్న గెలుపుదారి గురించి మాత్రమే కాదు.. ఇది యూరోప్ లాటరీ చరిత్రలో (Europe Lottery History) ఎన్నడూ జరుగని అరుదైన ఘట్టం.
ఐర్లాండ్‌కు (Ireland) చెందిన ఒకే ఒక్క టికెట్ దారుడు యూరో మిలియన్ల లాటరీలో (Lottery) చారిత్రాత్మక విజయం సాధించారు. ఆయన 208 మిలియన్ పౌండ్లు (సుమారు రూ. 2,120 కోట్లు) విలువైన జాక్‌పాట్ గెలుచుకున్నారు. ఇది ఇప్పటివరకు యూరోప్‌లో గెలుచుకున్న అతిపెద్ద లాటరీ బహుమతిగా నమోదైంది. ఈ గెలుపు ఐర్లాండ్ దేశానికి 18వ యూరో మిలియన్ల విజయం కాగా, ఆ దేశ చరిత్రలోనే ఇది అతిపెద్దది. ఐరిష్ నేషనల్ లాటరీ ఈ విషయాన్ని ధృవీకరించింది. లాటరీ నిర్వాహకులు ప్రజలను తమ టికెట్లను జాగ్రత్తగా పరిశీలించాలని కోరుతున్నారు. విజేత గెలిచిన నంబర్లు.. 13, 22, 23, 44, 49 కాగా లక్కీ స్టార్ నంబర్లు.. 03, 05గా ప్రకటించారు.
ఈ భారీ జాక్‌పాట్‌ను రెండు వారాల పాటు ఎవరూ గెలవలేదు. ఇప్పుడు ఒక ఐరిష్ టికెట్ దారుడు ఈ బంపర్ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. ఇక బ్రిటన్ పత్రిక ది మిర్రర్ ప్రకారం.. ఈ గెలుపుతో విజేత సంపద ప్రముఖ ఫుట్‌బాలర్ హ్యారీ కేన్ (115 మిలియన్ పౌండ్లు), పాప్ స్టార్ దువా లిపా (110 మిలియన్ పౌండ్లు)ల సంపద కంటే అధికమైంది. దీంతో ఆయన/ఆమె 2025 సండే టైమ్స్ రిచ్ లిస్ట్‌లో ఉన్న బ్రిటన్ ధనవంతుల జాబితాలోకి ప్రవేశించారు.
ఐరిష్ నేషనల్ లాటరీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సియాన్ మర్ఫీ మాట్లాడుతూ 'లాటరీ టికెట్లు కొన్న ప్లేయర్లు తమ టికెట్లను వెంటనే చెక్ చేయాలి. ఈ టికెట్ ఎవరి వద్ద ఉందో వారు టికెట్ వెనుక సంతకం చేసి, వెంటనే మా ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించాలి. మేము బహుమతి పొందడంలో పూర్తి సహాయం చేస్తాం' అని తెలిపారు. అలాగే, విజేత టికెట్ కొనుగోలు చేసిన ప్రదేశాన్ని త్వరలోనే వెల్లడిస్తామని ఆయన తెలిపారు.






