ఆకాశంలో అద్భుతం.. ఆ రోజు అరుదైన దృశ్యం ఆవిష్కృతం

by Jakkula.Mamatha |   (  Updated:2025-04-20 05:13:32  IST  )

ఆకాశంలో ఎన్నో అద్భుత దృశ్యాలు కనువిందు చేస్తూంటాయి.

ఆకాశంలో అద్భుతం.. ఆ రోజు అరుదైన  దృశ్యం ఆవిష్కృతం
X

దిశ,వెబ్‌డెస్క్: ఆకాశంలో ఎన్నో అద్భుత దృశ్యాలు కనువిందు చేస్తూంటాయి. ఈ క్రమంలో మరో 4 రోజుల్లో ఆకాశంలో ఓ వ్యక్తి నవ్వుతూ ఉన్నట్లుగా కనిపించే దృశ్యాన్ని తిలకించబోతున్నామని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2025 ఏప్రిల్ 25 సరిగ్గా తెల్లవారుజామున 4 లేదా 5 గంటల ప్రాంతంలో ఈ ఖగోళ విన్యాసాన్ని చూడొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ఆ సమయంలో శుక్రుడు, శని గ్రహాలు నెలవంకకు అతి చేరువగా రానున్నాయి. దీంతో త్రిభుజాకారంలో ‘‘స్మైలీ ఫేస్’’ కనువిందు చేయనుంది. సూర్యోదయానికి ముందు మాత్రమే ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించవచ్చని నాసా వెల్లడించింది. ఈ క్రమంలో శుక్రుడు, శని గ్రహాలు నెలవంకకు అతి చేరువగా రానున్నాయి. ఈ తరుణంలో చంద్రుడు, వీనస్, సాటర్న్ గ్రహాలు తమ కక్ష మార్గంలో ప్రయాణిస్తూ మూడు ఒకే వరుసలో కనిపించనున్నట్లు తెలిపారు.

ఈ అద్భుత దృశ్యాన్ని తెలంగాణలో హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్, గండిపేట సరస్సు, షామిర్ పేట, వరంగల్‌లో పాకాల సరస్సు లేదా భద్రకాళి ఆలయం ప్రాంతంలో వీక్షించవచ్చు అని చెబుతున్నారు. ఏపీలో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ ప్రాంతం, భవానీ ఐలాండ్, కొండపల్లి అటవీ ప్రదేశాల వద్ద ఈ అద్భుతాన్ని చూడొచ్చు. విశాఖపట్నంలో ఆర్ కె బీచ్ లేదా డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ వద్ద, తిరుపతిలో కొండ వ్యూ పాయింట్ లేదా చంద్రగిరి కోట సమీపంలో ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించవచ్చు. రెండు గ్రహాలు కాంతివంతంగా ఉంటాయి కాబట్టి కంటితోనే చూడొచ్చని టెలిస్కోప్ బైనాక్యులర్లతో మరింత క్లారిటీగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Next Story