స్పిటి లోయలో పర్యాటకులకు అరుదైన దృశ్యం.. నెట్టింట వీడియో వైరల్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-08 09:26:09  IST  )

సోషల్ మీడియాలో (Social media) నిత్యం ఎన్నో వీడియో షేర్ అవుతుంటాయి.

స్పిటి లోయలో పర్యాటకులకు అరుదైన దృశ్యం.. నెట్టింట వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో (Social media) నిత్యం ఎన్నో వీడియో షేర్ అవుతుంటాయి. అందులో అరుదైన విషయాలకు సంబంధించిన వీడియోలు, ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు ఎక్కువగా వీక్షిస్తుంటారు. అందుకే క్షణాల్లో వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా నెట్టింట అరుదైన దృశ్యానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఈ అరుదైన దృశ్యాన్ని చూసిన మీరు అదృష్టవంతులు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో తెలుసుకోవాలని ఉందా?

హిమాచల్‌ప్రదేశ్‌లోని స్పిటి లోయలో మంచు చిరుత పులి (Snow Leopard) సందడి చేసింది. కాజా నుంచి నాకో వెళ్తుండగా పర్యాటకులకు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న చిరుత కనిపించింది. మంచు చిరుతలు ప్రపంచంలోనే అత్యంత అరుదైన పులి. ఇవి సాధారణంగా ఎత్తైన పర్వత ప్రాంతాల్లో నివసిస్తూ, చాలా కొద్దిగా మాత్రమే కనిపిస్తాయి. మే నెలలో వాటిని చూడటం చాలా అరుదు. ఈ అరుదైన దృశ్యాన్ని వారు కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 'ఫోటోగ్రాఫర్లు నెలల తరబడి దీన్ని చూడటానికి కష్టపడతారు. మీరు మాత్రం ఇలా చూసారు.. అదృష్టమే!' అంటూ పలువురు నెటిజన్లు కామెంటు పెడుతున్నారు. ఇక ఇప్పటివరకు ఈ వీడియోకు 4 మిలియన్ వ్యూస్ రాగా, 2.29 లక్షల మంది లైక్ చేశారు.

Next Story
null