డెంటిస్ట్‌గా మారిన చిట్టి చిలుక.. చూస్తే అద్భుతం అనకుండా ఉండలేరు

by Disha Web Desk 3 |
డెంటిస్ట్‌గా మారిన చిట్టి చిలుక.. చూస్తే అద్భుతం అనకుండా ఉండలేరు
X

దిశ డైనమిక్ బ్యూరో: పచ్చని ఆకుల నడుమ తానొక ఆకులా కలిసిపోతూ.. దొండ పండు లాంటి ఎర్రని ముక్కుతో చూపరులను ఇట్టే అక్కట్టుకునే పక్షుల్లో రామచిలుక మొదటి స్థానంలో ఉంటుంది. ఇక ఎవరైనా నేర్పిస్తే తియ్యని పలుకులు వినసొంపుగా పలుకుతోంది. అయితే ఇప్పటి వరకు మాట్లాడే చిలుకను చూసి ఉంటారు. కానీ ఎప్పుడైనా వైద్యం చేసే చిలుకను చూసారా..? ఏంటి చిలుక ఎక్కడైనా వైద్యం చేస్తుందా..? అంటే చేస్తోంది అని నిరూపిస్తోంది ఓ చిలుక.

వివరాల్లోకి వెళ్తే.. ఎవరికైనా పంటి సమస్యలు ఉంటె వారు డెంటిస్ట్ దగ్గరకి వెళ్తారు. ఆ డెంటిస్ట్ రోగిని పరిశీలించి వైద్యం చేస్తారు. అయితే ఓ బాలుడు కూడా తనకి ఉన్న పిప్పి పంటిని తీయించుకోవడాని డెంటిస్ట్ దగ్గరకి వెళ్ళాడు. అయితే అక్కడ అతనికి వైద్యం చేసింది మాత్రం మనిషి కాదు. ఓ చిలుక ఆ బాలుడి పిప్పి పన్నును తీసి వేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చెయ్యగా అది ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన వారంతా రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి ఆ వీడియో పై మీరు ఒక లుక్కేసుకోండి.

Next Story

Most Viewed