- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కట్టిన రెండు నెలలకే పేలుడు...వాటర్ ట్యాంక్ షాకింగ్ వీడియో వైరల్
కట్టిన రెండు నెలలకే వాటర్ ట్యాంక్ లీకేజ్ అయిన షాకింగ్ వీడియో వైరల్ అయింది.

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో భయానక, ఫన్నీ వీడియోలు కూడా ఉంటాయి. ఇక మరికొన్ని సంఘటనలు వింతగా కూడా ఉంటాయి. అలాంటిదే తాజాగా ఓ ఘటన తెరపైకి వచ్చింది. కట్టిన రెండు నెలలకే ఓ వాటర్ ట్యాంకర్ అకస్మాత్తుగా పేలిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
నాసిరకం పనులు, పేలిన వాటర్ ట్యాంకర్
రాజస్థాన్ అజ్మీర్ నార్త్ లోని 80వ వార్డులో రెండు నెలల కిందట ఓ వాటర్ ట్యాంకర్ ను నిర్మించారు. ప్రభుత్వ ధనంతో ఓ కాంట్రాక్టర్ దీన్ని నిర్మించాడు. అయితే, ఈ టాంకర్ నిర్మించిన రెండు నెలలకే పేలిపోయింది. దీంతో ఈ ట్యాంకర్ లో ఉన్న నీళ్లన్నీ వృధా అవుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకర్ నిర్మించాలని ప్రభుత్వం డబ్బులు ఇస్తే.. నాసిరకంగా నిర్మాణం చేపట్టారని సీరియస్ అవుతున్నారు. ఈ వాటర్ ట్యాంకర్ కట్టడంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.






