10 అడుగుల పాముతో కండల వీరుడు... విషం బయటకు తీసి మరీ!

by velandi.Saikiran |

ప్రపంచంలో ఏ మూలకు వెళ్లిన పాములు ( Snakes) కచ్చితంగా ఉంటాయి. పాములంటే భయపడని వారు ఉండరు. ఇందులో కొన్ని

10 అడుగుల పాముతో కండల వీరుడు... విషం బయటకు తీసి మరీ!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలో ఏ మూలకు వెళ్లిన పాములు ( Snakes) కచ్చితంగా ఉంటాయి. పాములంటే భయపడని వారు ఉండరు. ఇందులో కొన్ని విషపూరితమైన పాములు (Venomous snakes) ఉంటే... మరికొన్ని హాని చేయనివి కూడా ఉంటాయి. అయితే ఈ విషపూరితమైన పాములను కూడా... పట్టేవారు ఉంటారు. ఎప్పుడైనా జన సమూహంలోకి పాములు వస్తే వెంటనే.. పాములు పట్టే వాళ్లు రంగంలోకి దిగి.. వాటిని తీసుకెళ్తారు. ఇలాంటి సంఘటనలు మనం చాలానే చూసాం.

అయితే తాజాగా దాదాపు పది అడుగులు ఉన్న కింగ్ కోబ్రా ను ( King Cobra)... ఓ కండల వీరుడు ఒంటి చేత్తో పట్టుకున్నాడు. దాని పట్టుకోవడమే కాదు... కోరలు పీకి విషం బయటికి వచ్చేలా చేశాడు. మొదట.. దానికి తల పైన గట్టిగా పట్టుకున్న ఆ కండల వీరుడు... ఆ తర్వాత ఓ బాటిల్ ను కొరికేలా చేశాడు. దీంతో పాములో ఉన్న విషం మొత్తం బయటకు వచ్చింది.

ఆ తర్వాత దాన్ని అటు ఇటు ఊపి... కింద పడేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజెన్స్... రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అంత భయంకరమైన పామును ఎలా పట్టుకున్నావ్ రా బాబు... అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ కండల వీరుడికి.. పెద్ద పని కాదని మరికొంతమంది అంటున్నారు.

instagramme link

Next Story