క్రిస్మస్ పర్వదినాన అద్భుతం.. హార్బర్‌లో సిలువ గుర్తుతో పీతల దర్శనం

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-25 07:39:38  IST  )

క్రిస్మస్ (Christmas) పండుగల వేళ అద్భుతం ఆవిష్కృతమైంది.

క్రిస్మస్ పర్వదినాన అద్భుతం.. హార్బర్‌లో సిలువ గుర్తుతో పీతల దర్శనం
X

దిశ, వెబ్‌డెస్క్: క్రిస్మస్ (Christmas) పండుగల వేళ అద్భుతం ఆవిష్కృతమైంది. కోనసీమ జిల్లా సఖినేటిపల్లి (Sakhinetipally) మండలం అంతర్వేది (Antharvedi) మినీ హార్బర్ వద్ద మత్స్యకారుల వలల్లో సిలువ ఆకారంతో ఉన్న రెండు అరుదైన పీతలు చిక్కాయి. వేల సంఖ్యలో సాధారణ పీతలు దొరికినప్పటికీ క్రిస్మస్ పండుగ పూటే సిలువ ఆకారంలో ఉన్న పీతలు దొరకడం పట్ల మత్స్యకారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పీతల డొప్పపై సహజంగా వివిధ ఆకృతుల్లో డిజైన్లు ఉంటాయని ఇలా సిలువ గుర్తుతో పీతలు ఇప్పడే చూస్తున్నామని పేర్కొన్నారు. దొరికిన సిలువ పీతలను దైవ సంకేతంగా భావించిన మత్స్యకారులు వాటిని విక్రయించకుండా మళ్లీ సముద్రంలోకే వదిలేశారు. అయితే, పీతల విషయం హార్బర్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లో దావానంలో వ్యాపించడంతో వాటిని చూసేందుకు జనం ఎగబడ్డారు. ఇక సోషల్ మీడియాలో సిలువ గుర్తులున్న పీతల వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

వీడియో ఇక్కడ: https://x.com/bigtvtelugu/status/2004084956331741453?s=20

Next Story