శ్రీరామ నవమి వేళ అద్భుతం.. 4 అంగుళాల అయోధ్య రామమందిరం సృష్టి

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-27 03:55:06  IST  )

రామ నవమి సందర్భంగా సూక్ష్మకళాకారుడు ఎల్.ఈశ్వర్ రావు అద్భుతం చేశారు. ఏడు రోజుల కృషితో 4 అంగుళాల అయోధ్య రామమందిర నమూనాను రూపొందించారు.

శ్రీరామ నవమి వేళ అద్భుతం.. 4 అంగుళాల అయోధ్య రామమందిరం సృష్టి
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి (Srirama Navami) సంబురాలు అంబరాన్నంటాయి. ఈ క్రమంలోనే ప్రముఖ సూక్ష్మకళాకారుడు ఈశ్వర్ రావు (Eshwar Rao) తన భక్తిని చాటుకున్నారు. అయోధ్య (Ayodhya)లో నూతనంగా నిర్మించిన రామమందిరాన్ని తలపించేలా ఒక అద్భుతమైన 4 అంగుళాల సూక్ష్మ నమూనాను ఆయన రూపొందించారు. అయితే, ఈ చిన్నారి మందిరం కేవలం 4 అంగుళాల ఎత్తు, 3 అంగుళాల వెడల్పు, 4 అంగుళాల పొడవు మాత్రమే ఉంది. ఈ ఆర్ట్ పూర్తి చేయడానికి ఆయనకు వరుసగా ఏడు రోజుల సమయం పట్టింది. శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా ఈ నమూనాను ఓ ప్రధాన ఆకర్షణగా (Centerpiece) ఉంచాలని ఈశ్వర్ రావు దీనిని సిద్ధం చేశారు.

ఈ సందర్భంగా ఈశ్వర్ రావు మాట్లాడుతూ.. రామ నామ స్మరణతో మన హృదయాలు ఎంతటి ఆనందంతో నిండిపోతాయో, నా ఈ కళాఖండం చూసినప్పుడు కూడా ప్రతి ఒక్కరికీ అదే స్థాయి ఆనందం కలగాలని కోరుకుంటున్నానని అన్నారు. గతంలో కూడా ఈశ్వర్ రావు అనేక జాతీయ, అంతర్జాతీయ అంశాలపై తన సూక్ష్మకళా నైపుణ్యాన్ని ప్రదర్శించి గుర్తింపు పొందారు.

Next Story