- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ బాదం తిని నా ఫైల్ ఎక్కడ పెట్టావో గుర్తుకు తెచ్చుకో.. మహిళా ఆఫీసర్‍కు వ్యక్తి వింత నిరసన వైరల్
ఫైల్ క్లియర్ చేయకుండా ఆఫీస్ చుట్టూ తిప్పుతున్న మహిళా అధికారికి ఓ వ్యక్తి వెరైటీ నిరసన వ్యక్తం చేశాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: తమ పని చేసి పెట్టాలంటూ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా కొంత మంది అధికారులు కనికరం చూపరు. ప్రజలకు సేవ చేసేందుకు ఈ ఉద్యోగంలో ఉన్నామనే విషయం మరిచిపోయి అధికార దర్భాన్ని ప్రదర్శిస్తుంటారు. అలాంటి అధికారులకు అక్కడక్కడా కొందరు సరైన రీతిలో బుద్ధి చెప్పడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ పని కోసం ఏడాదిగా తిప్పుకుంటున్న ఓ మహిళా అధికారి విషయంలో ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఓ వ్యక్తి వెరైటీ నిరసనకు దిగాడు. హౌసింగ్ బోర్డ్ కార్యాలయంలో తన పెండింగ్ ఫైల్ క్లియర్ కాకపోవడంతో విసిగిపోయిన సదరు వ్యక్తి, అధికారిణి టేబుల్‌పై బాదం ప్యాకెట్ పప్పులు చల్లి నిరసన తెలిపాడు.
ఇప్పుడైనా గుర్తు తెచ్చుకో..
ఈ బాదం తినండి. మీకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అప్పుడైనా నా ఫైల్ ఎక్కడ పెట్టారో గుర్తుకు వస్తే నాకు ఫోన్ చేసి చెప్పండి అంటూ వినూత్న రీతిలో తన నిరసన వ్యక్తం చేశాడు. ఈ వెరైటీ నిరసనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడు జరిగింతో తెలియనప్పడికీ వీడియోలో ఉన్న బాధితుడి ఆరోపణ ప్రకారం.. గడిచిన ఏడాదిగా ఈ మేడం తనను పరేషాన్ చేస్తోంది. నా ఫైల్ ఎక్కడ పెట్టారో తనకు దొరకడం లేదట. కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాను. అందువల్ల నేను ఇప్పుడు ఈ మేడంకు బాదం ఇచ్చాను. ఈ బాదం తింటే ఆమెకు జ్ఞాపక శక్తి పెరిగి నా ఫైల్ ఎక్కడ పెట్టారు గుర్తుకు వస్తుందేమో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ తతంగాని అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు పేదలకు, సామాన్యులకు సాయం చేయాలని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు పని చేయని అధికారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.






