- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇవేం ఆసనాలు నాయన...గాలిలోనే బండరాళ్లు పెట్టుకొని !
ప్రపంచవ్యాప్తంగా యోగా (Yoga) బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మన ఇండియాలో (India) నరేంద్ర మోడీ

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా యోగా (Yoga) బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మన ఇండియాలో (India) నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత యోగాకు.. ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది. అధికారికంగానే అన్ని ప్రభుత్వాలు యోగా దినోత్సవం నిర్వహిస్తున్నాయి. జనాలు కూడా యోగాను... ప్రతి రోజు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే యువకుడు... వేసిన ఓ యోగాసనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నీళ్లు ఉన్న బావి పైనే... గాల్లో తేలియాడుతూ ఆ యువకుడు.. యోగాసనం వేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అదేంటి మనోడు గాల్లో ఎలా ఆసనం వేశాడు...? అదేలా సాధ్యం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ ఆసనం వేసిన యువకుడు చాలా రోజుల నుంచి..యోగా బాగా ప్రాక్టీస్ చేసేవాడట. ఈ నేపథ్యంలోనే... వీడియోలో చూపించినట్లు... ప్రత్యేక యోగాసనం వేశాడు.
ఓ కర్రను బావికి అడ్డంగా కట్టారు. ఆ తర్వాత.. తన ప్రక్కటెముకలతో బ్యాలెన్స్ చేస్తూ ఆ కర్రపై కూర్చున్నాడు. ఆ తర్వాత తన రెండు కాళ్లపై రెండు బండరాయిలను కూడా వేసుకున్నాడు. అలా దాదాపు 15 నిమిషాల పాటు యోగాసనం వేశాడు. ఇందులో కొంచెం మిస్సయిన అతడు.. బావిలో పడడం గ్యారంటీ. అయితే యోగా అంతర్జాతీయ దినోత్సవం నేపథ్యంలో... ఈ వీడియో వైరల్ గా మారింది.
Twitter Link
Extreme power 🔥🔥#InternationalYogaDay2025 pic.twitter.com/dJ1YBUp1iE
— Sunanda Roy 👑 (@SaffronSunanda) June 21, 2025






