రోడ్డుపై గుట్కా ఉమ్మిన యువకుడు.. మున్సిపాలిటీ సిబ్బంది చేసిన పనికి షాక్ (వీడియో)

by Sujitha Rachapalli |

భారతదేశంలో స్వచ్ఛ భారత్ కింద కోట్లకు కోట్లు వేస్ట్ అయిపోతున్నాయి. కారణం జనాలకు సివిక్ సెన్స్ లేకపోవడమే. చెత్త బుట్ట పక్కనే ఉన్నా ఎవడు చూస్తున్నాడులే అని.. విసిరేసి వెళ్లిపోయే టైప్.. రోడ్డు మీద పడినా ఓకే..

రోడ్డుపై గుట్కా ఉమ్మిన యువకుడు.. మున్సిపాలిటీ సిబ్బంది చేసిన పనికి షాక్ (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : భారతదేశంలో స్వచ్ఛ భారత్ కింద కోట్లకు కోట్లు ఖర్చు అవుతున్నాయి. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంది పరిస్థితి. కారణం జనాలకు సివిక్ సెన్స్ లేకపోవడమే. చెత్త బుట్ట పక్కనే ఉన్నా ఎవడు చూస్తున్నాడులే అని.. విసిరేసి వెళ్లిపోయే టైప్.. రోడ్డు మీద పడినా ఓకే.. డస్ట్ బిన్‌లో పడినా ఓకే.. అది మన భారతీయుల లక్షణం. మనం మారం.. దేశంలో మార్పు తేలేము అన్నట్లుగా ఉంది పరిస్థితి. కఠినంగా వ్యవహరిస్తే కానీ పరిస్థితి మారేలా లేదు. దేశంలోనే క్లీనెస్ట్ సిటీగా పేరుగాంచిన ఇండోర్.. ఎందుకంత పరిశుభ్రంగా ఉందంటే.. ఇందుకే అనే ఉదాహరణ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ యువకుడు స్కూటర్‌పై వెళ్తూ రోడ్డుపైనే గుట్కా ఉమ్మేశాడు. దీన్ని చూసిన మున్సిపాలిటీ సిబ్బంది.. ఫాలో చేసి మరీ అడ్డగించారు. అతనితోనే ఆ ప్లేస్‌ను క్లీన్ చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ట్రెండ్ అవుతుండగా.. ఇలాంటి రూల్స్ దేశంలోని అన్ని ప్రాంతాల్లో తీసుకురావాలని సూచిస్తున్నారు నెటిజన్లు. అప్పుడే దేశం స్వచ్ఛ భారత్‌గా మారుతుందని చెప్తున్నారు.

VIDEO

Next Story