బాత్రూంలో చేయాల్సిన పనులు బస్సులోనే... ఈ కుర్రాడి వీడియో చూస్తే !

by velandi.Saikiran |

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా... ఓ వ్యక్తి చేసిన పని.. సోషల్ మీడియాలో వైరల్

బాత్రూంలో చేయాల్సిన పనులు బస్సులోనే... ఈ కుర్రాడి వీడియో చూస్తే !
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా... ఓ వ్యక్తి చేసిన పని.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బస్సులోనే... షేవింగ్ చేస్తూ.. కనిపించాడు సదరు వ్యక్తి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చాలా మంది ట్రావెల్ బస్సుల్లో ప్రయాణిస్తారు అన్న సంగతి తెలిసిందే. గోవా, బెంగళూరు, హైదరాబాద్ లాంటి పట్టణాలకు.. వెళ్తే లగ్జరీ బస్సులోనే చాలామంది వెళ్తారు.

అందులోనూ స్లీపర్ క్లాసులు కూడా ఉంటాయి. స్లీపర్ బస్సుల్లో ఎక్కామంటే... హాయిగా పడుకుని మన గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అయితే ఓ వ్యక్తి అచ్చం అలాగే స్లీపర్ బస్సు బుక్ చేసుకున్నాడు. కాసేపు అలా పడుకుని.. సేవింగ్ పైన దృష్టి పెట్టాడు. ఆఫీస్ కు వెళ్లాల్సిన పనో... లేదా ఇంటర్వ్యూకు... వెళ్లాల్సిన పని ఉందో తెలియదు కానీ... బస్సులోనే కూర్చొని సేవింగ్ చేసుకున్నాడు.

అలా బస్సుల్లో షేవింగ్ (shaving) చేసుకుంటే.. చాలామంది ట్రిమ్మర్ వాడుతూ ఉంటారు. మనోడు అలా కాదు... సెలూన్ షాప్ లో చేసుకున్నట్లుగానే... వేస్ట్ పెట్టుకుని మరీ సేవింగ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోలో చూసిన నెటిజన్స్ పగలబడి నవ్వుకుంటున్నారు. వాళ్ల మేనేజర్ షేవింగ్ చేసుకోకపోతే... చుక్కలు చూపిస్తాడని... బాత్రూంలో చేయాల్సిన పనులు బస్సులోనే చేస్తున్నాడని అందరూ కామెంట్స్ చేస్తున్నారు.

Instagramme Link

Next Story