- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral : ప్రతిరోజూ జిమ్‌లో గడపాలని భార్యను టార్చర్ చేస్తున్న భర్త.. ఆ సెలబ్రిటీ లాంటి ఫిట్‌నెస్ కోసమంటూ..
రోజూ 3 గంటలు జిమ్‌లో గడపాల్సిందేనని భార్యను టార్చర్ చేస్తున్న భర్త.. నోరా ఫతేహి లాంటి పర్సనాలిటీ కోసమంటూ.. ఏం చేశాడో తెలుసా?

దిశ, ఫీచర్స్ : ఇది విన్నారా..? ఓ 26 ఏండ్ల వ్యక్తి తన భార్య విషయంలో వ్యవహరించిన తీరు చూస్తే.. అయ్యో ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారేంట్రా బాబూ.. అని ఆశ్చర్యపోతారు ఎవరైనా..! అది అమాయకత్వమో, అతి వ్యామోహమో, భార్య పట్ల ఉన్న ప్రేమో, శ్రద్ధో.. ఇంకేదో తెల్వదు కానీ.. సదరు వ్యక్తి రోజూ 3 గంటలు జిమ్‌లో గడపాల్సిందేనని భార్యను టార్చర్ చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతూ నెటిజన్లలో క్యూరియాసిటీని పెంచుతోంది. అదే సందర్భంలో పలు విమర్శలకు దారితీస్తోంది.
వ్యాయామాలకోసం జిమ్‌కు వెళ్లడం సహజమే. అయితే అది వ్యక్తిగత ఇష్టాయిష్టాలను బట్టి కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక భర్త నచ్చిన ఒక ప్రముఖ బాలీవుడ్ నటి నోరా ఫతేహీ (Bollywood actress Nora Fatehi) లాంటి శరీరాకృతి వచ్చేలా ఫిట్‌నెస్ సాధించాలని, అందుకోసం డైలీ మూడు గంటలు జిమ్‌లో అందుకు అవసరమైన కసరత్తులు చేయాల్సిందేనని పట్టుబడుతున్నాడు. తనకు ఇష్టం లేదని అతని భార్య ఎంత మొత్తుకున్నా వినకుండా ఆ విధమైన ఫిట్‌నెస్ పొందితేనే నీతో కాపురం చేస్తా.. లేకుంటే లేదని మొండికేస్తున్నాడ సదరు భర్త మహాశయుడు. దీంతో భర్త టార్చ్ భరించలేని సదరు మహిళ మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతూ ఇబ్బందులు పడుతోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతరుల కోరికలకోసం ఎవరూ తమ సహజమైన గుర్తింపును మార్చుకోవాల్సిన అవసరం లేదని, ఇది సరైన పద్ధతి కాదని కామెంట్ చేస్తున్నారు. Link






