ఆఫ్ఘనిస్తాన్ లోనూ ఎన్టీఆర్ కు క్రేజ్‌..అరవింద సమేత మూవీ వీక్షిస్తూ

by velandi.Saikiran |

జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమాను ఓ ఆఫ్ఘనిస్తాన్ కుర్రాడు తమ దేశంలో చూస్తున్న వీడియో వైరల్ గా మారింది.

ఆఫ్ఘనిస్తాన్ లోనూ ఎన్టీఆర్ కు క్రేజ్‌..అరవింద సమేత మూవీ వీక్షిస్తూ
X

దిశ‌, వెబ్ డెస్క్‌: జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నందమూరి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ , తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. RRR లాంటి సినిమా చేసి, పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత నుంచి అన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత దేవర 2 చేసే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

ఆఫ్ఘనిస్తాన్ లోనూ జూనియర్ ఎన్టీఆర్ కు క్రేజ్

జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమాను ఓ ఆఫ్ఘనిస్తాన్ కుర్రాడు తమ దేశంలో చూస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఓ తెలుగు యూట్యూబ్ ఆఫ్ఘనిస్తాన్ పర్యటనలో భాగంగా వీడియోలు తీస్తున్న క్రమంలో.. ఈ సంఘటన బయట పడింది. బస్సులో ట్రావెలింగ్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ మూవీని చూశాడు స‌ద‌రు ఆఫ్ఘనిస్తాన్ యువకుడు. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ క్రేజ్ గురించి కూడా మాట్లాడాడు. తనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని... ఆయన సినిమాలు మిస్ కాకుండా చూస్తానని సదరు ఆఫ్గనిస్తాన్ అభిమాని వెల్లడించారు. తెలుగు అర్థం కాదు కాబట్టి.. హిందీలో డబ్ అయిన‌ ఎన్టీఆర్ సినిమాలు చూస్తానని స్పష్టం చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ కు నేనొక్కడినే కాదు.. ఆఫ్ఘనిస్తాన్ లో చాలా మంది అభిమానులు ఉన్నారని ఈ సందర్భంగా సదరు వ్యక్తి వెల్లడించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Next Story