ఆడు మగాడ్రా బుజ్జి..స్టీరింగ్ లేకున్నా డ్రైవింగ్.. వీడియో వైరల్

by velandi.Saikiran |

డ్రైవింగ్ ( Driving).. అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం అన్న సంగతి తెలిసిందే. బైక్ రైడింగ్ లేదా కా ( Car) డ్రైవింగ్ అన్నా...రే

ఆడు మగాడ్రా బుజ్జి..స్టీరింగ్ లేకున్నా డ్రైవింగ్.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : డ్రైవింగ్ ( Driving).. అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం అన్న సంగతి తెలిసిందే. బైక్ రైడింగ్ లేదా కారు ( Car) డ్రైవింగ్ అన్నా... ఏదైనా సరే చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా లాంగ్ డ్రైవ్ వెళ్లేందుకు జనాలు చాలా ఇష్టపడతారు అన్న సంగతి తెలిసిందే. అలా వెళ్తే కచ్చితంగా కారు డ్రైవింగ్ చేయవచ్చని.. ప్రకృతి అందాలు ఆస్వాదించవచ్చని అనుకుంటారు.

ఇక కొంత మంది డ్రైవింగ్ లో రకరకాల స్టంట్స్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఓ డ్రైవర్ చేసే విన్యాసం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓల్డ్ మోడల్ ఫోర్ వీలర్.. వాహనాన్ని స్టీరింగ్ లేకుండానే నడిపేసాడు. స్టీరింగ్ లేకపోవడంతో... దాని స్థానంలో ఓ స్పానర్ (spanar) పెట్టేశాడు. స్క్రూ పెట్టి తిప్పే స్పానర్ స్టీరింగ్ స్థానంలో పెట్టి.. హాయిగా డ్రైవింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్లాడు.

ఈ సంఘటన మనదేశంలో కాకుండా విదేశాల్లో జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజెన్స్... రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆడు మగాడ్రా బుజ్జి... స్టీరింగ్ లేకుండానే... డ్రైవింగ్ చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. స్టీరింగ్ లేకున్నా ఇలా నడపడం సూపర్ ఐడియా అంటూ మరికొంతమంది అతన్ని పొగుడుతున్నారు.


Next Story