- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీడి కష్టం పగవాడికి కూడా రాకూడదు... ఓ లేడీ చేతిలో అడ్డంగా !
సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే, మరికొన్ని

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే, మరికొన్ని హృదయాన్ని టచ్ చేస్తూ ఉంటాయి. అయితే తాజాగా.. మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ అమ్మాయి చేతిలో... కుర్రాడు ఎలా మోసపోయాడనేదే ఈ వీడియో. వివరాల్లోకి వెళ్తే... ఏపీకి చెందిన ఓ యువకుడు రైల్వే స్టేషన్ లో నిల్చున్నాడు.
ఈ సందర్భంగా... ఆ కుర్రాడి దగ్గరికి పాతికేళ్ల యువతి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఆ అమ్మాయి... అడగగానే తన మొబైల్ ఫోన్ ఇచ్చాడు రైల్వే స్టేషన్ లో ఉన్న కుర్రాడు. తన తండ్రికి ఫోన్ చేసి ఇస్తానని, రిక్వెస్ట్ చేయడంతో.. జాలిపడిన ఆ యువకుడు మొబైల్ ఫోన్ ఇచ్చాడు. ఇక్కడే అడ్డంగా దొరికిపోయాడు. అనంతరం తన తండ్రికి ఫోన్ చేసిన యువతి... నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, అతనితో వెళ్లిపోతున్నాను... నాకోసం వెతకండి నాన్న అంటూ చెప్పిందట.
అనంతరం కాల్ కట్ చేసి... ఆ కుర్రాడి మొబైల్ ఇచ్చేసింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. తన కూతురు ఫోన్ చేయడంతో తండ్రి అలర్ట్.... కాల్ బ్యాక్ చేశాడు. అప్పటికే అక్కడి నుంచి అతని కూతురు వెళ్ళిపోయింది. దీంతో ఫోన్ లిఫ్ట్ చేసిన... రైల్వే స్టేషన్ కుర్రాడు... అమ్మాయి తండ్రి తో మాట్లాడాడు. ఈ సందర్భంగా.. తన కూతురిని.. ఎందుకు తీసుకువెళ్లావ్? అసలు ఎవర్రా నువ్వు? అంటూ ఫోన్ కాల్ లో అమ్మాయి తండ్రి బండ బూతులు తిట్టాడట.
ఆ రైల్వే స్టేషన్ కుర్రాడు ఎంత క్లారిటీ ఇచ్చినా కూడా తండ్రి అస్సలు వదలలేదు. ఫోన్ కట్ చేసిన కూడా మళ్లీ మళ్లీ చేశాడట. అలా వెయ్యి సార్లు ఫోన్ చేసినట్లు... తన బాధను సోషల్ మీడియాలో పంచుకున్నాడు ఆ కుర్రాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన తమ స్టైల్లో రియాక్ట్ అవుతున్నారు. ఇలాంటి సొల్లు వీడియోలు పెట్టకు.. అని కొందరు అంటుంటే... పాపం రైల్వే స్టేషన్ కుర్రాడు బకరా అయ్యాడు కదరా అంటూ మరికొందరు అంటున్నారు. ప్రేమించింది ఒకడిని, ఇరికించింది మరొకడిని అంటూ ఆ యువతీని కొంతమంది తిడుతున్నారు.
వీడి కష్టం పగవాడికి కూడా రాకూడదు pic.twitter.com/uThzOLSd63
— ismailbhaii (@atheisttindiann) April 26, 2025






