- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తండ్రి బాధ తట్టుకోలేక...ఈ బుడ్దోడే డ్యూటీ ఎక్కాడు...వీడి పర్ఫార్మెన్స్ కి ఆస్కార్ పక్కా
ఈ కుర్రాడు.. లాప్టాప్ ముందు పెట్టుకుని.. హెడ్ సెట్ మెడలో వేసుకొని తన తండ్రి లాగానే జాబ్ చేస్తున్నట్లు ఫీల్ అయ్యాడు

దిశ, వెబ్ డెస్క్ : చిన్నపిల్లల అల్లరి మామూలుగా ఉండదు. ఎంత వద్దన్నా అదే పని చేసి చూపిస్తారు. అందుకే చిన్న పిల్లలు ఉన్న ఇల్లు గందరగోళంగా ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేకపోతే ఇల్లు పీకి పందిరి వేస్తారు. ఇక జనరేషన్ మారిన కొద్దీ.. పిల్లలు కూడా చాలా అప్డేట్ అయిపోతున్నారు. పుట్టిన ఏడాది తిరగకముందే.. రీల్స్ చూస్తున్నారు. సెల్ ఫోన్ పట్టి.. గేమ్స్ కూడా ఆడేస్తున్నారు. ఈ చిన్న పిల్లల చిలిపి చేష్టలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం మనం చూస్తూనే ఉంటాం.
అయితే తాజాగా స్కూలుకు వెళ్లే కుర్రాడు.. చేసిన పని చూస్తే.. మనం షాక్ అవ్వాల్సిందే. తన తండ్రి చేసిన పనిని... అచ్చు దించేశాడు. తన తండ్రి లాగా డ్యూటీ చేస్తున్నట్లు.. లాప్టాప్ ముందు పెట్టుకుని రచ్చ రచ్చ చేశాడు. ఈ వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఆ బుడ్డోడు ఈ తండ్రి సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినట్టుంది. వర్క్ ఫ్రం హోం చేస్తాడు కావచ్చు. వర్క్ ఫ్రం హోం చేసే వాళ్ళ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది. ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూనే డ్యూటీ కూడా చేయాలి.
ఇక అందులో చిన్న పిల్లలు... చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అయితే తన తండ్రి అనుభవించిన బాధలను చూసిన ఈ కుర్రాడు.. లాప్టాప్ ముందు పెట్టుకుని.. హెడ్ సెట్ మెడలో వేసుకొని తన తండ్రి లాగానే జాబ్ చేస్తున్నట్లు ఫీల్ అయ్యాడు. కాస్త ఓవర్ గా రియాక్ట్ అవుతూ... అరుస్తూ లాప్టాప్ లో ఏదో టైప్ చేశాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఫైనల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్... తెగ నవ్వుకుంటున్నారు. తన తండ్రి కష్టాన్ని చూసి బుడ్డోడు డ్యూటీ ఎక్కాడని.. కొంతమంది అంటుంటే.. వాడికి ఆస్కార్ ఇవ్వాల్సిందే అని మరికొంతమంది అంటున్నారు. క్లిక్






