- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెగ్గర్ వద్ద నోట్ల కట్టలు.. లెక్కించలేక అలసిపోయిన ప్రజలు
యాచకురాలి వద్ద కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టలతో పాటు ఓ బస్తాలో నాణేలు బయటపడ్డాయి. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: యాచకురాలి వద్ద కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టల (Bundles of notes)తో పాటు ఓ బస్తాలో నాణేలు బయటపడ్డాయి. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని రూర్కీ (Roorkee)లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మతిస్థిమితం సరిగా లేని ఓ మహిళా రూర్కీలో యాచకురాలి (Beggar)గా మారి.. అక్కడక్కడే తిరుగుతుంది. అయితే ఇటీవల కొంతమంది సేవా బృందం ఆమె వద్దకు వెళ్లి.. సహాయం చేయాలని చూశారు. దీంతో ఆమె వారిని దూరంగా తరమడం ప్రారంభించింది. ముఖ్యంగా తన వద్ద ఉన్న బస్తాలను ఎవరిని ముట్టుకొనియలేదు. దీంతో అనుమానం వచ్చి.. వారంతా కలిసి ఆమె వద్ద ఉన్న సంచులను తనిఖీ చేశారు.
దీంతో ఆమె సంచిలో 10, 20, 50, 100, 500 రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి. అలాగే మరో బస్తాలో పెద్ద మొత్తంలో 1, 2, 5, 10 రూపాయల నాణేలను స్థానికులు గుర్తించారు. అనంతరం వారు స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చి.. ఆమె వద్ద ఉన్న డబ్బులు లెక్కించే ప్రయత్నం చేశారు. లక్షలాది రూపాయలు ఉండటంతో వారు ఆ డబ్బును లెక్కించి ఆలిసిపోయారే కానీ.. యాచకురాలి వద్ద ఉన్న డబ్బు అయిపోలేదు. దీంతో స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో యాచకురాలి వద్ద కుప్పలు తెప్పలుగా ఉన్న నగదు స్పష్టంగా కనిపించింది.






